ఎన్నికల తర్వాత వారికి జింతాక్… జింతాక్ అట

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాలుగా అవమానాలను ఎదుర్కొంటున్నారు. తాను ప్రజల మద్దతుతో విజయం సాధించినప్పటికీ టీడీపీ నేతలు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తనను ఇబ్బంది పాలు [more]

Update: 2021-02-09 14:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్ని రకాలుగా అవమానాలను ఎదుర్కొంటున్నారు. తాను ప్రజల మద్దతుతో విజయం సాధించినప్పటికీ టీడీపీ నేతలు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తనను ఇబ్బంది పాలు చేయడం జగన్ సహించలేకపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేంత వరకూ సంయమనం పాటించాలని జగన్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎటూ వైసీపీదే ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. అధికారంలో ఉండటంతో సహజంగా ప్రజలు కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు. సో.. ఎన్నికల ఫలితాల గురించి పెద్దగా బెంగలేదు.

నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని…..

ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఆడుతున్న డ్రామా మరికొంత కాలం కొనసాగుతుందని, వాటిని చూసీ చూడనట్లు వదిలేయడమే మంచిదని జగన్ సీనియర్ నేతలకు చెప్పినట్లు తెలిసిింది. మనం రెచ్చిపోయే కొద్దీ వారికి అనవసర పబ్లిసిటీ తప్ప మరేం ప్రయోజనం లేదని కూడా జగన్ వివరించారంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మహా ఉంటే మరో రెండు నెలలు కొనసాగుతుంది.

ఎన్నికల తర్వాత….?

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ నేతలను జగన్ టార్గెట్ చేయనున్నారు. ఇప్పటికే కొందరు నేతలు భూ వివాదాల్లోనూ, వ్యాపార లొసుగులతోనూ ఉన్నారు. వారందరికీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చుక్కలు చూపించాలన్నది జగన్ భావనగా ఉంది. ఇప్పటికే గొట్టిపాటి రవికుమార్ వంటి టీడీపీ నేతల వ్యాపారాలపై వరస దాడులు నిర్వహించారు. మరికొందరు వ్యాపారాలను నిలిపివేసుకున్నారు.

విశాఖ భూ కుంభకోణంపై….?

ఇలా కాకుండా విశాఖ సిట్ రిపోర్ట్ అందిన వెంటనే చర్యలు తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమయింది. ఇందులో టీడీపీ ముఖ్యమైన నేతల పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. సిట్ నివేదిక మరో మూడు నెలల్లో ప్రభుత్వానికి అందనుంది. అప్పటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. నిమ్మగడ్డ తలనొప్పి పోతుంది. విశాఖ భూ కుంభకోణంలో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతను జగన్ టార్గెట్ చేస్తారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ నేతలకు జగన్ చుక్కలు చూపించడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News