ఎంత రచ్చయితే అంత మంచిదట

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత పంతానికి పోతే అంత మంచిదా? జగన్ కు అది అనుకూలంగా మారనుందా? పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి ఫలితాలు అనుకూలంగా [more]

Update: 2021-01-23 12:30 GMT

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత పంతానికి పోతే అంత మంచిదా? జగన్ కు అది అనుకూలంగా మారనుందా? పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి ఫలితాలు అనుకూలంగా రానున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎంత మొండిగా వ్యవహరిస్తే అంత మంచిదన్న అభిప్రాయంలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏం జరిగినా అది మన మంచికే అన్న ధోరణిలో జగన్ సర్కార్ ఉంది.

తొమ్మిది నెలల నుంచి….

నిజానికి తొమ్మిది నెలల నుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య యుద్ధమే జరుగుతుంది. మార్చి 8వ తేదీన ఎన్నికలను నిలిపివేయడంతో మొదలయిన ఈ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం, తిరిగి పునర్నియామకం వరకూ ఎన్నో ట్విస్ట్ లు కొనసాగాయి. ఇటు నిమ్మగడ్డ రమేష్ కుమార్, అటు జగన్ ప్రభుత్వం ఎవరూ దిగి రాకపోవడం, పంతానికి పోవడంతో రాష్ట్రంలో రెండు వ్యవస్థల గత కొంత కాలంగా మధ్య వార్ జరుగుతుంది.

ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని…..

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం తాము సుప్రీంకోర్టుకు వెళ్లామని చెబుతోంది. ఎన్నికలను నిర్వహించాల్సింది జిల్లా యంత్రాంగమే కావడంతో ఇప్పడు ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ సహకారం లేనిదే ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదు. అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం మొండిగానే వెళుతున్నారు. కానీ ఎంత రచ్చ జరిగితే అంత మంచిదని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లుంది.

సింపతీ వస్తుందా?

ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై వ్యవస్థలను అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్న విమర్శలున్నాయి. జగన్ పాలనను ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని చూస్తున్నారన్న వాదన ఉంది. రాజధాని తరలింపు నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ టీడీపీయే వ్యవస్థలను అడ్డంపెట్టుకుని జగన్ కు ఇబ్బంది కలిగిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ప్రజల్లో ఇది తమకు సానుభూతి ని తెచ్చిపెడుతుందని జగన్ పార్టీ భావిస్తుంది. ఎంత రచ్చ జరిగి ఎన్నికలు జరిగితే అది ఫలితాల్లో తమకే అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండటం విశేషం.

Tags:    

Similar News