జగన్ భయపడుతున్నారా? పంతానికి పోతున్నారా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారా? న్యాయస్థానాలు తీర్పులను కూడా లెక్క చేయకుండా ఎన్నికలను ఎందుకు వద్దంటున్నారు. గెలవలేమని భయమా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

Update: 2021-01-22 03:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడుతున్నారా? న్యాయస్థానాలు తీర్పులను కూడా లెక్క చేయకుండా ఎన్నికలను ఎందుకు వద్దంటున్నారు. గెలవలేమని భయమా? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉన్న సమయంలో ఎన్నికలకు వెళ్లకూడదనా? ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వ సహకారంతోనే ఎన్నికల కమిషన్ ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.

గెలుపుపై ధీమా ఉన్నా…..

నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ పార్టీకి గెలుపు పై ఎటువంటి భయం లేదు. ఎందుకంటే కరోనా సమయంలోనూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా జగన్ సంక్షేమ పథకాలను ఏమాత్రం ఆపలేదు. అమ్మఒడి, రైతు భరోసా, ఇళ్ల స్థలాల వంటి పథకాలను లబ్దిదారులకు చేర్చగలిగారు. గత ఇరవై నెలల్లో 63 వేల కోట్ల రూపాయల నిధులను జగన్ కేవలం సంక్షేమ కార్యక్రమాలకే వెచ్చించారు. ఇది జగన్ కు పూర్తిగా అనుకూల అంశమే. మరోవైపు పార్టీ అధికారంలో ఉంది.

నిమ్మగడ్డతోనే అసలు సమస్య…..

సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కర్ణాటకలోనూ అధికార బీజేపీకే అనుకూలంగా ఫలితాలొచ్చాయి. అయితే జగన్ భయపడి ఎన్నికలకు వెనక్కు తగ్గడం లేదంటున్నారు. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన పంతంతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. టీడీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారన్న భావన బలంగా ఉంది. ఆయనను ఆర్డినెన్స్ ద్వారా పదవి నుంచి తొలగించినా న్యాయస్థానాలతో పదవిని దక్కించుకోవడం జగన్ జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే జగన్ ఎన్నికలను ఈ సమయంలో వ్యతిరేకిస్తున్నారు.

అనుకూలంగా రాకుంటే?

న్యాయస్థానాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా తీర్పు చెప్పాయి. రేపు సుప్రీంకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పలేం. గతంలో కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుకే కట్టుబడి ఉండాలని పేర్కొంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో కూడా అనుకూలంగా వస్తుందని చెప్పలేం. దీంతో ఏపీ లో స్థానికసంస్థల ప్రక్రియ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది న్యాయ నిపుణుల అంచనా. అయితే సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే జగన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News