తిరుపతిలో గెలిచినా.. గేలిచేయడం ఖాయమేనటగా?

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వైఎస్ జగన్ వ్యూహమేంటి? ఇప్పటి వరకూ ఆయన పట్టీపట్టనట్లే ఎందుకు వ్యవహరిస్తున్నారు? దానిని తన ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంగా చూడాలని జగన్ [more]

Update: 2021-01-25 03:30 GMT

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వైఎస్ జగన్ వ్యూహమేంటి? ఇప్పటి వరకూ ఆయన పట్టీపట్టనట్లే ఎందుకు వ్యవహరిస్తున్నారు? దానిని తన ప్రభుత్వ పనితీరుకు రిఫరెండంగా చూడాలని జగన్ భావిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో వైఎస్ జగన్ అంత సీరియస్ గా ఉన్నట్లు కన్పించడం లేదు. ఇప్పటి వరకూ అధికారికంగా అభ్యర్థిని కూడా జగన్ ప్రకటించలేదు. కొన్ని లీకులు మాత్రం బయటకు వచ్చాయి.

ఎలాగైనా గెలుచుకుని…

తిరుపతి పార్లమెంటు సిట్టింగ్ స్థానం. వైసీపీ ఎలాగైనా దీనిని గెలుచుకోవాల్సి ఉంటుంది. కేవలం గెలుచుకుంటేనే సరిపోదు. అందుకు తగ్గ మెజారిటీ కూడా లభించాయి. గత ఎన్నికల్లో రెండు లక్షలకు పైగానే వైసీపీకి మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కూడా అదే మెజారిటీ రావాల్సి ఉంటుంది. మెజారిటీ ఏమాత్రం తగ్గినా ప్రభుత్వం పనిఅయిపోయిందని గెలిచినా విపక్షాలు గేలిచేయడం ఖాయం. వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరును జగన్ ఖరారు చేశారంటున్నారు.

మెజారిటీపైనే….

అయితే ఇంతవరకూ దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదనే చెబుతున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఆయన ఇటీవల కాలంలో పర్యటించింది లేదు. అమ్మఒడి రెండో దశ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలోనే ప్రారంభించినా అది పట్టణానికే పరిమితమయింది. కాళహస్తి నియోజకవర్గంలో మాత్రం జగన్ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక గూడూరు, వెంకటగరి నియోజకవర్గాల్లో వైసీపీలోనే అసంతృప్తి ఉంది.

అసంతృప్తిని తొలగించేందుకు…..

వైసీపీ ఎమ్మెల్యేల్లో అధినాయకత్వంపై ఉన్న అసంతృప్తిని, కొందరి ఎమ్మెల్యేలపై క్యాడర్ లో ఉన్న ఆగ్రహాన్ని కూడా జగన్ తొలగించే ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు. త్వరలోనే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారని చెబుతున్నా ఇంతవరకూ ఎవరికి బాధ్యతలను అప్పగించలేదు. మరోవైపు టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. బాధ్యులను కూడా నియమించింది. ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. బీజేపీ, జనసేనలు సయితం బాధ్యులను నియమించి ముందుకు వెళుతున్నాయి. కానీ జగన్ మాత్రం తిరుపతి విషయంలో కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News