జగన్.. దానిని అటకెక్కించినట్లేనా?

జగన్ తీసుకున్న మరో నిర్ణయం కార్యరూపం దాల్చే అవకాశాలు కన్పించడం లేదు. శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏడాదికి పైగా అవుతున్నా [more]

Update: 2021-01-27 03:30 GMT

జగన్ తీసుకున్న మరో నిర్ణయం కార్యరూపం దాల్చే అవకాశాలు కన్పించడం లేదు. శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏడాదికి పైగా అవుతున్నా ఇప్పటి వరకూ దానిని పట్టించకున్న దాఖలాలు లేవు. శాసనమండలి పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అది లైవ్ లోనే ఉంది. కొత్త సభ్యులు వచ్చి చేరుతున్నారు. తాజాగా పార్లమెంటు సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేేపథ్యంలో శాసనమండలి అంశం మరోమారు చర్చనీయాంశమైంది.

మండలిని రద్దు చేస్తూ…..

శాసనమండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏడాదికి పైగానే అవుతుంది. ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు జరిగినా ఈ అంశం అజెండాలోనే లేదు. జగన్ కూడా అనేక మార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలసి వచ్చారు. అప్పడు కూడా శాసనమండలి అంశంపై ఎటువంటి స్పష్టత రాలేదు. దీనిపై జగన్ కూడా పెద్దగా సీరియస్ గా దృష్టి పెట్టలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు.

రద్దయిన తర్వాత…..

శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలకమైన బిల్లులు తిరస్కరణకు గురి అవుతుండటంతో జగన్ తొలినాళ్లలో ఆగ్రహంతో ఉన్నారు. అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాత క్రమంగా అన్ని బిల్లులు ఆమోదం పొందడటంతో ఇప్పుడు శాసనమండలి వ్యవహారాన్ని జగన్ పూర్తిగా పక్కన పెట్టారని కొందరు అంటున్నారు. అందుకే శాసనమండలి రద్దు అయిన తర్వాత కూడా ఎమ్మెల్సీలుగా నలుగురిని జగన్ నియమించారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

పార్లమెంటు సమావేశాల్లో…..

ఇక పార్లమెంటు సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ వరకూ తొలివిడత జరుగుతాయి. మళ్లీ మార్చి 8వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో శాసనమండలి అంశం వస్తుందా? రాదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే జగన్ వైపు నుంచి శాసనమండలిపై ఎటువంటి వత్తిడి ఉండదని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద శాసనమండలి రద్దు నిర్ణయం ఇక అటకెక్కినట్లే అనుకోవాలి.

Tags:    

Similar News