ఏ సీఎంకు ఇలా జరగలేదే? జగన్ కే ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తనకు ఏదీ కలసి రావడం లేదు. తీసుకున్న [more]

Update: 2021-01-18 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. తనకు ఏదీ కలసి రావడం లేదు. తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదు. ఇలా జగన్ పాలనలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. ఏ ముఖ్యమంత్రికి ఎదురుకాని అనుభవాలు జగన్ కు మాత్రమే ఎదురవుతున్నాయి. ఇటు న్యాయస్థానాలు, మరోవైపు ఎన్నికల కమిషన్ ల నుంచి జగన్ తీసుకున్న తన ప్రతి నిర్ణయానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి.

రాజ్యాంగ సంస్థలతోనే…..

రాజ్యాంగ సంస్థలతోనే జగన్ తొలి నుంచి పోరాటం చేయాల్సి వస్తోంది. ఒకవైపు విపక్షాల విమర్శలను, మరోవైపు రాజ్యాంగ వ్యవస్థల నుంచి కూడా ఫైట్ చేయాల్సిన పరిస్థితి. మూడు రాజధానులు పెట్టాలని జగన్ నిర్ణయించారు. అది రైటో.. రాంగో… 151 సీట్లను ఇచ్చి జనం మద్దతుతో గెలిచిన జగన్ తీసుకున్న నిర్ణయమిది. కానీ అది ఏడాదిన్నర కావస్తున్నా అమలు కావడం లేదు. న్యాయస్థానాల్లోనే ఈ అంశం ఇంకా నలుగుతోంది. ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలియదు.

ఎన్నికల కమిషన్ తో…..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో జగన్ ప్రభుత్వానికి పది నెలల నుంచి పడటం లేదు. ఆయన టీడీపీకి వత్తాసుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. తమకు తెలియకుండా ఎన్నికలను ఏకపక్షంగా అప్పట్లో వాయిదా వేశారని, ఇప్పుడు అదే తరహాలో షెడ్యూల్ ను విడుదల చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాల్సిన ప్రభుత్వం వద్దని చెబుతున్నా ఎన్నికల కమిషనర్ మాత్రం షెడ్యూల్ ను విడుదల చేశారు.

ఫైట్ చేయడంతోనే…..

దీనిపై మళ్లీ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. ఒక ముఖ్యమంత్రిగా, అధికారంలో ఉన్న ప్రభుత్వాధినేతగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు అమలు కాకపోవడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తీసుకుంటున్న నిర్ణయాల్లో లోపాలు ఉండటంతోనే న్యాయసమీక్షల్లో విఫలమవుతున్నామా? అన్నది కూడా జగన్ పరిశీలించుకోవాల్సి ఉంది. విపక్షం ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసేందుకే ప్రయత్నిస్తుంది. పైగా అక్కడ ఉన్నది చంద్రబాబు. పార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ. ఆయనకు అన్ని రకాల పరిచయాలు, అనుబంధాలు ఉన్నాయని మర్చిపోవడమే జగన్ ఈ వైఫల్యానికి కారణమని చెప్పక తప్పదు.

Tags:    

Similar News