జగన్ అంత శక్తిమంతుడా?

కొంతమంది రాజకీయ అవసరాలు ఉన్న వారిని మినహాయిస్తే, అత్యధిక భారతీయులు జీవన విధానం వేరు. హిందూ అనేది మతం కంటే జీవన విధానంగానే స్థిరపడింది. క్రీస్తు పూర్వం [more]

Update: 2021-01-07 09:30 GMT

కొంతమంది రాజకీయ అవసరాలు ఉన్న వారిని మినహాయిస్తే, అత్యధిక భారతీయులు జీవన విధానం వేరు. హిందూ అనేది మతం కంటే జీవన విధానంగానే స్థిరపడింది. క్రీస్తు పూర్వం 400లు, 600ల సంవత్సరాల్లో వచ్చిన జైన, బౌద్ధ మతాలను తనలో కలుపుకోగలిగిన విశాల స్వభావం హిందూ ధర్మానికి ఉంది. చివరికి 20వ శతాబ్దం తొలినాళ్ళలో వచ్చిన షిర్డీసాయిని కూడా తనలో కలిపేసుకోగల ఫ్లెక్సీబిలిటీ హిందూ ధర్మానికి ఉంది. అలాగే ఇప్పుడు తెలంగాణలోని మైసమ్మ, పోచమ్మ వంటి గ్రామదేవతలను, సమ్మక్క, సారక్క వంటి ఆరాధనార్హమైన వారిని కూడా తనలో ఇముడ్చుకోగల ఫ్లెక్సీబిలిటీని మనం హిందూ విధానంలో చూస్తున్నాం.

జీవన విధానమే ….?

ఇంత ఫ్లెక్సీబిలిటీ ఉన్న మతం, అత్యధిక ప్రజానీకం జీవనవిధానంగా మారిన హిందూ మతానికి ఎక్కడో, ఎవరో ఓ విగ్రహం ధ్వంసం చేయడం ద్వారానో, ఓ దేవస్థానాన్ని ధ్వంసం చేయడం ద్వారా ప్రమాదం ఉందని అనుకోవడం, ఆందోళన చెందడం అవసరం లేదు.పైగా చాలా యేళ్ళ క్రితం దేశంపై దండయాత్రలు చేసి గుడులను పడగొట్టిన ముస్లిం సామ్రాట్టులకంటే, వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన బ్రిటీష్ క్రైస్తవులకంటే జగన్ మోహన్ రెడ్డి శక్తిమంతుడు కాదు.

అది అవివేకమే…..

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కొన్ని దేవాలయాలు కూల్చేసి హిందూ మతం ఉనికిని దెబ్బతీసే శక్తిమంతుడు జగన్ అనుకున్నా, కొన్ని దేవాలయాల్లో ఇలాంటి చర్యల ద్వారా దెబ్బకొట్టగల బలహీనమైనది హిందూ ధర్మం అనుకున్నా అది అవివేకం అవుతుంది. మహావీరుడి జైనం, గౌతముడి బౌద్ధం, షిర్డీసాయి సబ్ కా మాలిక్ విశ్వాసాలతో సహా మైసమ్మ, పోచమ్మల గ్రామీణ విశ్వాసాలను తనలో కలిపేసుకున్న హిందూ ధర్మం ఒక గుడిలో ఓ విగ్రహం పగిలినంత మాత్రనే నశించిపోతుందనుకోవడం ఓ భ్రమ.

-గోపి దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News