అందుకేనా జగన్ అలా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కల నెరవేరుతోంది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇళ్ల పట్టాల [more]

Update: 2020-12-25 00:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కల నెరవేరుతోంది. దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ జరగనుంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని తలపెట్టారు. నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి తర్వాత పక్కా ఇంటిని నిర్మించాలని జగన్ భావించారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా లబ్దిదారులను కూడా ఎంపిక చేశారు.

30 లక్షల మందికి….

దాదాపు 35 లక్షల మంది వరకూ లబ్దిదారులు ఉన్నట్లు గుర్తించారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో పాటు లక్షల మందికి అవసరమైన ఇళ్ల స్థలాలను కూడా సేకరించారు. అనేక చోట్ల ప్రయివేటు భూములను సేకరించారు. ప్రభుత్వ భూమి అందుబాటులో లేని చోట ప్రయివేటు భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనిపై టీడీపీ ఆరోపణలు చేసింది. జగన్ తన పార్టీ నేతలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఇళ్ల స్థలాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ప్రయివేటు భూములను…..

కొన్ని చోట్ల ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తుల నుంచి సేకరించిన భూములపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. అలాగే మైనింగ్ భూములను, అటవీ భూముల విషయంలోనూ కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో కొన్ని స్థలాలు న్యాయపరమైన వివాదాలు ఎదురయ్యాయి. ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జగన్ ప్రభుత్వం అనేక ముహూర్తాలు పెట్టి తిరిగి వాయిదా వేసుకుంటూ వచ్చింది.

న్యాయపరమైన ఇబ్బందులు….

అయితే న్యాయపరంగా ఇబ్బందులున్న చోట పక్కన పెట్టి, మిగిలిన ప్రాంతాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 25వ తేదీ నుంచి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు 15 రోజుల పాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ ప్రారంభం కానుంది.

Tags:    

Similar News