విశాఖను దత్తత తీసుకున్న జగన్ ?

శ్రీమంతుడు ఒక హీరో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని పూర్తిగా అభివృద్ధి చేస్తాడు. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కి విశాఖ మీద మోజు పెరిగింది. దాంతో [more]

Update: 2020-12-23 00:30 GMT

శ్రీమంతుడు ఒక హీరో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని పూర్తిగా అభివృద్ధి చేస్తాడు. అలాగే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ కి విశాఖ మీద మోజు పెరిగింది. దాంతో ఆయన అడగకుండానే ఎన్నో వరాలు ఇస్తున్నారు. పాలనా రాజధానిగా విశాఖను చేయడం వెనక జగన్ దృఢ సంకల్పం మాత్రమే ఉంది తప్ప మరోటి ఏదీ లేదని చెప్పకతప్పదు, ఇక జగన్ విశాఖ మెగా సిటీకి సరికొత్త రూపం ఇవ్వడానికి తాజాగా అనేక ప్రతిపాదనలు చేస్తున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న నగర అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాల కల్పనకు జగన్ పెద్ద పీట వేస్తున్నారు.

పనిగట్టుకుని మరీ …..

విశాఖ సహజసిద్ధంగా అందమైన నగరం. కాలక్రమేణా చాలా వరకూ అభివృద్ధి సాధించింది. ఇటువంటి నగరాన్ని చేయి పట్టి నడిపించే నాధుడు మాత్రం ఇంతవరకూ లేడనే చెప్పాలి. కొన్ని ప్రాంతాలను నావి అనుకుని నాయకులు పనిగట్టుకుని ముందుకు కదిలిస్తే ప్రగతి రధం వేగంగా పరుగులు తీస్తుంది. దానికి ఎన్నో ఉదాహరణలు ఈ దేశంలోనే ఉన్నాయి. అన్నీ తమ ప్రాంతానికి కొందరు నాయకులు పట్టుకుపోతున్నారు అని ఆరోపణలు వచ్చినా కూడా నేతలు ఖాతరు చేయకుండా అభివృద్ధి చేసిన చరిత్ర కూడా ఈ దేశానికి తెలుసు. ఇపుడు జగన్ చూపు విశాఖ మీద పడడంతో ఈ నగరం దశ తిరుగుతుందా అన్న ఆశలైతే కలుగుతున్నాయి.

మౌలిక వసతులకు ప్రాధాన్యత….

విశాఖ వైపు ఓసారి చూస్తే ఎన్నో డిమాండ్లు కనిపిస్తాయి. ముఖ్యంగా నగరానికి మౌలిక సదుపాయాలు మరింతగా పెరగాల్సి ఉంది. అలాగే చెన్నై, బెంగుళూరు మాదిరిగా ఏ మూల నుంచి మరేమూలకు అయినా రోడ్ కనెక్టివిటీ పెరగాల్సి ఉంది. ఇపుడు జగన్ సర్కార్ ఆ పనుల మీదనే దృష్టి పెట్టింది. ఎటూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాబోతోంది. అది విశాఖకు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో భోగాపురాన్ని కేంద్రంగా చేసుకుని విశాఖ వరకూ రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జగన్ సర్కార్ రెడీ అవుతోంది. అలాగే టూరిజం పరంగా కూడా విశాఖకు ఏమేం కావాలి, ఏమేం చేయాలి అన్న దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ రెడీ అవుతోంది. విశాఖకు ఇవాళ‌ కాకపోయినా రేపు అయినా రాజధాని షిఫ్ట్ అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్న జగన్ ఆ దిశగా ప్రగతి లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు.

చిరకాల డిమాండ్లు అలా….

విశాఖలో అతి పెద్ద తీరప్రాంతం ఉంది. దాదాపుగా 132 కిలోమీటర్ల తీరప్రాంతాన్ని ఆధారం చేసుకుని 63 మత్య కార గ్రామలు ఉన్నాయి. వేట మీద ఆధారపడి రెండు లక్షల మత్యకార కుటుంబాలు ఉన్నాయి. దాంతో జెట్టీ, ఫిషింగ్ హార్బర్ వంటివి చిరకాల డిమాండ్లుగా ఉన్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక వీటి మీద కూడా కదలిక మొదలైంది. భీమిలీకి జెట్టీ అన్నది దాదాపు ఒక శతాబ్దం నాటి కలగా ఉంది. 1930 ప్రాంతం తరువాత భీమిలీలో పోర్ట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. అప్పటికి విశాఖ పోర్ట్ సిధ్ధం కావడమే కారణం. దాంతో నాటి నుంచి భీమిలీలో జెట్టీ అయినా నిర్మిస్తామని హామీలు నేతలు ఇచ్చారు. కానీ అవి నోటి మాటలకే పరిమితమయ్యాయి. ఇన్నాళ్ళకు జగన్ భీమిలీలో ఒక జెట్టీ నిర్మించాలని నిర్ణయించారు. అలాగే విశాఖ జిల్లా నక్కపల్లి రాజయ్యపేటలో మరో జెట్టీకి కూడా ప్రతిపాదించారు. ఇక భోగాపురం వద్ద పూడిమడకలో ఒక ఫిషింగ్ హార్బర్ ని కూడా నెలకొల్పడానికి జగన్ ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇవన్నీ చూసినపుడు కలలాంటి డిమాండ్లు నెరవేరడం పట్ల జనంలో హర్షం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News