ఏది జరిగినా జగన్ కు లాభమేనా?

మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు కన్పించడం లేదు. ఏడాది క్రితం జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. దీనిపై శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేశారు. గవర్నర్ [more]

Update: 2020-12-19 02:00 GMT

మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశాలు కన్పించడం లేదు. ఏడాది క్రితం జగన్ మూడు రాజధానులను ప్రకటించారు. దీనిపై శాసనసభ, శాసనమండలిలో తీర్మానం చేశారు. గవర్నర్ ఆర్డినెన్స్ ను కూడా జారీ చేశారు. అయినా మూడు రాజధానుల అంశం ముందుకు సాగడం లేదు. ఇది న్యాయస్థానాల్లో నలుగుతుండటమే ఇందుకు కారణం. ప్రధానంగా న్యాయరాజధాని అంశంతో జగన్ కు ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఇప్పట్లో లేనట్లే కన్పిస్తుంది.

మూడు రాజధానుల ఏర్పాటు…

అమరావతి నుంచి రాజధానిని తరలించి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జగన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ న్యాయస్థానంలో కేసుల కారణంగా అది సాధ్యం కాలేదు. ఇది సుదీర్ఘకాలం పట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రధానంగా కర్నూలుకు న్యాయరాజధానిని తరలించడం అంత సులువు కాదన్న వాదనలు విన్పిస్తున్నాయి.

న్యాయరాజధాని విషయంలో….

మళ్లీ కేంద్ర ప్రభుత్వం కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుకు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రపతి మళ్లీ నోటిఫికేషన్ ను విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి పెద్ద కసరత్తే చేయాలంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాల్సి ఉంటుంది. అయితే బీజేపీ డిమాండ్ కూడా కర్నూలు లో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలని ఉండటంతో సహకరిస్తారన్న నమ్మకంతో జగన్ ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ కు బీజేపీ ఈ విషయంలో ఏ మేరకు సహకరిస్తుందన్నది చూడాల్సి ఉంది.

వచ్చే ఎన్నిక నాటికి…..

వచ్చే ఎన్నికల నాటికి మూడు రాజధానుల ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోతే ఖచ్చితంగా జగన్ కు అడ్వాంటేజీ అవుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మూడు జిల్లాల్లో కొంత ప్రభావం చూపినా మిగిలిన ప్రాంతాల్లో జగన్ పార్టీకి సానుకూలత లభిస్తుందంటున్నారు. కోర్టులను అడ్డంపెట్టుకుని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఇప్పటికే వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. మరి మూడు రాజధానులు ఏర్పాటయినా, కాకపోయినా జగన్ కు కొత్తగా వచ్చే నష్టమేమీ లేకపోగా, రాజకీయంగా ప్రయోజనమే అధికంగా ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News