జగన్ ఊరికే అనలేదట

జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? రాజధాని అమరావతి అంశంగా గత ఆరు నెలలుగా వైసీపీ దోబూచులాడుతోంది. రాజధాని అమరావతిలో నిర్మాణాలన్నీ దాదాపు జగన్ ప్రభుత్వ నిలిపేసింది. దీంతో [more]

Update: 2019-12-19 11:00 GMT

జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? రాజధాని అమరావతి అంశంగా గత ఆరు నెలలుగా వైసీపీ దోబూచులాడుతోంది. రాజధాని అమరావతిలో నిర్మాణాలన్నీ దాదాపు జగన్ ప్రభుత్వ నిలిపేసింది. దీంతో జగన్ ముఖ్యమంత్రిగా చేపట్టిన తొలినాళ్లలోనే రాజధాని అమరావతిపై టీడీపీలో ఆందోళన నెలకొంది. అయితే జగన్ ఆరు నెలల వరకూ రాజధాని అమరావతిపై పెదవి విప్పలేదు. అంతా మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ చూసుకున్నారు. సత్తిబాబు తన ప్రకటనలతో కన్ ఫ్యూూజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

మైండ్ గేమ్ మాత్రమేనా?

తాజాగా అమరావతిపై జగన్ చేసన ప్రకటన మైండ్ గేమ్ లో భాగమేనంటున్నారు. సచవాలయాన్ని మళ్లీ విశాఖకు తరలించడం జరిగే పని కాదన్నది వైసీపీ నేతలే అంతర్గతంగా అంగీకరిస్తున్నారు. గత ఐదేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి అమరావతికి రావడానికే ఉద్యోగులు విముఖత చూపారు. దీంతో వారికి వారానికి రెండు దినాలు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో హైదరాబాద్ లోనే ఏపీ సచివాలయం ఉద్యోగులు కాపురమంటూ రాజధాని అమరావతిలో బ్యాచిలర్ లైఫ్ ను గడుపు తున్నారు.

ఉద్యోగుల్లో వ్యతిరేకత…..

ఇప్పుడు మళ్లీ విశాఖపట్నం వెళ్లాలంటే ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం ఖాయం. హైదరాబాద్ అంటే శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరి వెళ్లి తిరిగి సోమవారం మధ్యాహ్నానికి అమరావతికి చేరుకోగలరు. స్పెషల్ ట్రయిన్ కూడా వీరికి వేశారు. విశాఖ అంటే అది సాధ్యంకాని పని. ఇప్పటి వరకూ ఉద్యోగ సంఘాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయకున్నప్పటికీ అంతర్గతంగా వీరు జగన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నట్లే కన్పిస్తుంది.

ఆ రెంటి కోసమేనా?

అయితే సచివాలయాన్ని ఇప్పటికిప్పుడు మారిస్తే ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాదన్నది ఆర్థిక నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. కేవలం టీడీపీ నేతల ఆర్థిక మూలాలను పెకిలించి వేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే జగన్ ఈ ప్రకటన చేశారంటున్నారు. కర్నూలు కు హైకోర్టుకు వెళుతుందని, సచివాలయంలో మార్పు ఉండదన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమచారం. మొత్తం మీద జగన్ మైండ్ గేమ్ లో భాగంగానే ఈ మూడు రాజధానుల ప్రకటన చేశారంటున్నారు.

Tags:    

Similar News