ఈసారి 151 కాదు గదా..?…. ఒట్టిమాటేనట

జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయనిపిస్తోంది. 2022 లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంకేతాలను బట్టి తెలుస్తోంది. విపక్షాలను మరింత వీక్ [more]

Update: 2020-12-16 02:00 GMT

జమిలి ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయనిపిస్తోంది. 2022 లో జమిలి ఎన్నికలు రావడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంకేతాలను బట్టి తెలుస్తోంది. విపక్షాలను మరింత వీక్ చేయాలంటే జమిలి ఎన్నికలకు వెళ్లాల్సిందేనని మోదీ మొండి పట్టుదలతో ఉన్నారు. అయితే జమిలి ఎన్నికలు వస్తే ఏపీ సంగతేంటి? జగన్ పరిస్థితి ఏంటి? జగన్ జమిలి ఎన్నికల్లో నెగ్గుకు రాగలరా? లేదా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

జమిలి ఎన్నికలకు…..

జమిలి ఎన్నికల ప్రస్తావనను మరోసారి తెలంగాణ మంత్రి కేటీఆర్ సయితం తెచ్చారు. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు సయితం ముందుగానే ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. దీంతో జమిలి ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే జమిలి ఎన్నికలు వస్తే జగన్ కు ఇంకా రెండేళ్లు సమయం మాత్రమే ఉంటుంది.

కరోనాతోనే సగం కాలం….

జగన్ అధికారంలోకి వచ్చి కేవలం పదహారు నెలలే అవుతుంది. ఏడాది మొత్తం కరోనాతోనే గడిచిపోయింది. కరోనా వైరస్ కారణంగా ఎలాంటి అభివృద్ధి పనులను జగన్ చేపట్టేలేకపోయారు. పోలవరం ప్రాజెక్టు కూడా నత్తనడకనే సాగుతుంది. మరోవైపు రాజధాని ఎక్కడో తెలియక పరిశ్రమలు కూడా ఏపీ వైపు చూడటం లేదు. దీంతో జమిలి ఎన్నికలు వస్తే జగన్ తట్టుకుని నిలబడటం కష్టమేనన్న కామెంట్స్ పార్టీలోనే బలంగా విన్పిస్తున్నాయి.

అంతా అయోమయం…..

ఇప్పటికే వైసీపీ లో వర్గ విభేదాలు దాదాపు 70 నియోజకవర్గాల్లో భగ్గుమంటున్నాయి. వీటిని సర్దుబాటు చేయడం కూడా జగన్ కు కష్టంగా మారింది. ఎమ్మెల్యేలపై అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ను కాపాడేది సంక్షేమ పథకాలే. ఆయన పదహారు నెలలుగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే జమిలి ఎన్నికల్లో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జగన్ నెగ్గుకు రావడం కష్టంగానే కన్పిస్తుంది. ఒకవేళ విజయం సాధించినా ఈసారి 151 అన్నది ఒట్టిమాటగా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

Tags:    

Similar News