జగన్ కి బిగ్ ఫ్యాన్ గా మారిన స్టార్ ?

ఆయన దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడు. ఎవరి అండదండలు లేకుండా సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. అదే ప్రజల దీవెనలతో పీపుల్స్ స్టార్ [more]

Update: 2020-12-14 08:00 GMT

ఆయన దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడు. ఎవరి అండదండలు లేకుండా సినీ రంగంలో ప్రవేశించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. అదే ప్రజల దీవెనలతో పీపుల్స్ స్టార్ గా ఎదిగాడు. ఆయనే ఆర్ నారాయణమూర్తి. ఆయన ఒక డిఫరెంట్. ఆయన సినిమాలూ అంతే. విప్లవ కధలతో కూడా హిట్లు కొట్టి ఒకానొక దశలో తెలుగు సినిమాను కీలకమైన మలుపు తిప్పాడు. ఒకానొక దశలో సినిమాకు అదే అసలైన కమర్షియల్ ఫార్ములా అని నిజం చేసి రుజువు చేసిన ఎర్రన్న అతను. వ్యక్తిగతంగా కూడా ఆయనవి కమ్యూనిస్ట్ భావాలు. ఒక సిద్ధాంతానికి కట్టుబడిన నారాయణమూర్తి పాలకులకు వ్యతిరేకంగా అన్ని సినిమాలూ తీశాడు. ఏలీకలను వెండి తెర మీద విలన్లను చేసి కన్నెర్ర చేశాడు. అటువంటి నారాయణమూర్తి ఏపీ సీఎం జగన్ కి బిగ్ ఫ్యాన్ గా మారిపోయాడు.

దేశంలోనే లేదుట ….

దేశంలోనే లేని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత జగన్ ది అని తాజాగా నారాయణమూర్తి జగన్ ని తెగపొగిడారు. జగన్ పేదల పక్షపాతి అని కూడా కితాబు ఇచ్చారు. పేదల చేతుల్లో నాలుగు డబ్బులు ఆడుతున్నాయి అంటే అది జగన్ పధకాల చలవే అని కూడా నారాయణమూర్తి అంటున్నారు. జగన్ మంచి పాలకుడు, దార్శనీకుడు అని కూడా రెడ్ స్టార్ చెప్పడం విశేషమే.

అనుసంధానం గొప్ప పని …..

తూర్పుగోదావరి విశాఖ సరిహద్దు ప్రాంతాలు సస్యశ్యామలం కావాలని జగన్ మంచి ఆలోచన చేసి ఏలేరు తాండవ రిజర్వాయర్లను అనుసంధానం చేయడాన్ని గొప్ప ఆలోచనగా నారాయణమూర్తి పొగిడారు. ఇలా చేయడం వల్ల మెట్ట ప్రాంతం రైతాంగానికి నేరుగానే లబ్ది చేకూరుతుందని కూడా ఆయన అంటున్నారు. రైతులకు మేలు చేసే ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచారని కూడా ఆయన పొగిడేశారు.

జగన్ తోనే అభివృద్ధి ….

ఉత్తరాంధ్రా జిల్లాల అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని నారాయణమూర్తి స్పష్టం చేస్తున్నారు. అత్యంత వెనకబడిన ఉత్తరాంధ్రా గురించి జగన్ మాదిరిగా పట్టించుకున్న పాలకులు లేరని కూడా ఆయన అంటున్నారు. జగన్ ఏలుబడిలో ఉత్తరాంధ్రా ప్రగతిపధంలో పయనిస్తుందని నారాయణమూర్తి ఆశాభావంగా చెబుతున్నారు. అంతే కాదు, విశాఖను పాలనారాజధానిగా చేయడం పట్ల కూడా పూర్తి మద్దతు ప్రకటించారు. మొత్తానికి సినీమాయా లోకంలో అందరూ అవసరాల కోసం పెదవుల పైన నవ్వులు చిందించేవారే. పాలకుల వద్దకు వెళ్ళి తమ పలుకుబడి ఉపయోగించుకుని పబ్బం గడుకునే వారే. జనం కోసం ఏ చిన్న మంచి పని చేసినా మెచ్చి మీడియా ముందు ఏ ఫలాపేక్షా లేకుండా పొగడడం మాత్రం ఆర్ నారాయణమూర్తి లాంటి పీపుల్స్ స్టార్స్ కే చెల్లింది. మొత్తానికి జగన్ పాలన ఎలా ఉంది అన్న దాని మీద ఏ సర్వేలూ అవసరం లేదు. నారాయణమూర్తి లాంటి జనం సమస్యలు తెలిసిన తటస్థులు చెప్పే నిఖార్సు అయిన అభిప్రాయాలు చాలు.

Tags:    

Similar News