ఫుల్లు క్లారిటీ అప్పుడే వస్తుందట

ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమయింది. ఆరేళ్లుగా విజయాలనే చవిచూస్తున్న టీఆర్ఎస్ కు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రంలో [more]

Update: 2020-12-21 08:00 GMT

ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టమయింది. ఆరేళ్లుగా విజయాలనే చవిచూస్తున్న టీఆర్ఎస్ కు ఓటర్లు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ లో కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందో? రానున్న ఎన్నికల్లో స్పష్టమవుతుందని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఏడాదిన్నర మాత్రమే…..

నిజానికి జగన్ అధికారంలోకి వచ్చి ఒకటిన్నర ఏడాది మాత్రమే అవుతుంది. ఈ ఏడాదిన్నరలో జగన్ అభివృద్ధి కంటే సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. దీంతో పాటు కరోనా వైరస్ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బతీసింది. అయినా సంక్షేమ పథకాల విషయంలో జగన్ వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయంలో లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఒక వర్గంలో మాత్రం వ్యతిరేకత స్పష్టంగా కన్పిస్తుంది.

కొన్ని వర్గాలు మాత్రం….

అయితే జగన్ సామాజికవర్గాల వారీగా లబ్ది చేకూరుస్తుండటంతో వారంతా తమ వైపే ఉంటారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. కానీ అది ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఆస్తిపన్ను రద్దు చేశారు. వరద బాధితులకు పదివేల సాయం అందించారు. కానీ ఎన్నికల్లో మాత్రం ఓటరు టీఆర్ఎస్ వైపు చూడలేదు. ఇప్పుడు అదే లెక్క ఏపీలోనూ వర్తిస్తుందని టీడీపీ భావిస్తుంది.

క్లారిటీ వస్తుందని…..

అందుకే రానున్న కాలంలో ఏపీలో జరిగిన ఏ ఎన్నికైనా జగన్ ప్రభుత్వానికి కొలమానంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు సంక్షేమం వైపు ఉన్నారా? లేక అభివృద్ధిని కాంక్షిస్తున్నారా? అన్నది తేలిపోతుంది. ఎన్నో అంశాలపై ఎన్నికల ఫలితాలు ఏపీ ప్రభుత్వ పనితీరుపై క్లారిటీ ఇవ్వనున్నాయి. జగన్ కు కూడా రానున్న ఎన్నికలు ఒక రూట్ మ్యాప్ ను నిర్దేశిస్తాయని వైసీపీ సీనియర్ నేతలు కూడా చెబుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జగన్ పార్టీ సీన్ ఏంటో అర్ధమవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News