ఆల్ ఈజ్ వెల్ కాదు జగన్

ఒకరికి పాతిక మంది మంత్రులున్నా ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధవంతంగా వివరించే సాహసం మంత్రులు ఎందుకు చేయడం లేదు. జగన్‌ జట్టుగా ఏరికోరి చేర్చుకున్న వారు అటు శాఖల్ని [more]

Update: 2019-09-12 09:30 GMT

ఒకరికి పాతిక మంది మంత్రులున్నా ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధవంతంగా వివరించే సాహసం మంత్రులు ఎందుకు చేయడం లేదు. జగన్‌ జట్టుగా ఏరికోరి చేర్చుకున్న వారు అటు శాఖల్ని సమర్ధవంతంగా నడిపించకుండా ఇటు ప్రతిపక్షాల విమర్శల్ని తిప్పికొట్టకుండా ఎందుకు విఫలమవుతున్నారనేదే అందరిలో ఉన్న ప్రశ్న. ప్రతిపక్షంలో ఉన్నపుడే చాలామంది వైఎస్సార్‌సీపీ నేతలు ఉత్సాహంగా ప్రభుత్వానికి కౌంటర్‌ ఇచ్చేవారు. వారిలో చాలామంది మంత్రులయ్యారు. సీనియర్లను పక్కన పెట్టి యువరక్తంతో క్యాబినెట్‌ను నింపుకున్నా జగన్మోహన్‌ రెడ్డికి పెద్దగా ఉపయోగపడటం లేదు.

తమ పని కాదన్నట్లు….

మంత్రుల్లో మూడొంతుల మంది ప్రతిపక్షాల దాడుల్ని, విమర్శల్ని తిప్పి కొట్టడం తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చలో ఆత్మకూరు విషయంలో టీడీపీ దూకుడు ప్రదర్శించడం వెనుక వేరే కారణాలున్నా, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో మాత్రం జగన్ సర్కార్ విఫలమైంది. ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి., రాయలసీమ నుంచి టీడీపీ నేతలు కట్టగట్టుకుని బెజవాడ వరకు వచ్చేస్తే నగరంలోనే ఉన్న వైసీపీ మంత్రులు మాత్రం ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టలేకపోయారు. దీనికి చాలా కారణాలు., గుసగుసలు వినిపిస్తున్నాయి.

స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేక….

మంత్రులుగా ఉన్నా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు లేనందున పెద్దగా యాక్టివ్‌గా ఉండట్లేదనేది వారి వాదనగా ఉంది. తమ శాఖ తరపునో, విధానపరంగానో, మరో అంశంలోనో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకరికి పదిమంది సలహా తీసుకోవాల్సి రావడం, సీఎంఓలోనే ముగ్గురికి వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో సైలెంట్‌ గా ఉంటున్నారట. అయ్యా సీఎం జగన్ గారూ వింటున్నారా…. మీకు చెప్పే వాళ్లు లేకపోవచ్చు…. అంతా ఆల్‌ ఈజ్ వెల్ అనుకుంటే చివరకు ఏం జరుగుతుందో తెలుసుగా.

Tags:    

Similar News