జగన్ ఇకనైనా కళ్లు తెరవవా?

అవినీతికి, అక్రమాలకు తన పాలనలో తావులేదని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పాలన కూడా పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం జగన్ ఆదేశాలను [more]

Update: 2019-10-11 06:18 GMT

అవినీతికి, అక్రమాలకు తన పాలనలో తావులేదని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పాలన కూడా పారదర్శకంగా ఉంటుందని చెప్పారు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం జగన్ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న సంగతి రుజువైంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అర్హులైన వారి నిబంధలను ప్రభుత్వం రూపొందించింది. రైతు భరోసా కార్యక్రమం కింద అర్హులైన వారికి పెట్టుబడి పథకం కింద యాభై వేలు, పన్నెండువేల రూపాయలు రెండు దఫాలుగా ప్రభుత్వం రైతులకు ఇవ్వనుంది.

ఏకంగా మంత్రి పేరునే…..

వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమం కింద ఇప్పుడు అర్హులైన వారిలో ఏకంగా ఒక మంత్రి చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ను రైతు భరోసా కింద లబ్దిదారుడిగా అధికారులు ఎంపిక చేశారు. నిబంధనల ప్రకారం ఐదు ఎకరాలకు మించి పొలం ఉన్న వ్యక్తులు ఈ పథకం కింద అర్హులు కాదు. అలాగే ఆదాయపు పన్నును చెల్లించే వారికి సయితం ఈ పథకం వర్తించదు. అంతేకాకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ సర్పంచ్ లకు కూడా ఈ పథకం వర్తించదు. అయితే ఏకంగా రైతు భరోసా పథకం కింద ఏకంగా మంత్రి ఆదిమూలపు సురేష్ పేరును చేర్చడం చర్చనీయాంశంగా మారింది.దీనిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News