పర్లేదు.. నాట్ బ్యాడ్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి నాలుగు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? నాలుగు నెలల్లోనే జగన్ [more]

Update: 2019-10-09 12:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టి నాలుగు నెలలు కావస్తుంది. ఇప్పటి వరకూ ఆయన తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? నాలుగు నెలల్లోనే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందా? లేదంటే అది విపక్షాలు చేస్తున్న ప్రచారమా? అంటే జగన్ కు విపక్షాలు చెప్తున్నంత ప్రజా వ్యతిరేక ఏదీ రాలేదు. ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వే ప్రకారం జగన్ నిర్ణయాలను సామాన్య ప్రజలు సమర్థిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలపై కూడా ఈ సంస్థ సర్వేను నిర్వహించింది.

మద్యనిషేధంపై….

తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే దీనిపై ప్రజల్లో ఎలాంటి చర్చ జరగడం లేదు. ఎప్పుడూ గ్రామాల్లో ఉండే కక్షలే ఇప్పుడూ చోటు చేసుకుంటున్నాయని ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మద్యం దుకాణాల విషయంలో జగన్ కు మంచి మార్కులే పడుతున్నాయి.ముఖ్యంగా మహిళలు మాత్రం మద్యపానం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. బెల్ట్ షాపులు ఎత్తివేయడం, సర్కారీ మద్యం దుకాణాలను రాత్రి 9గంటలకే మూసివేయడం వంటి వాటిని అభినందిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జగన్ ఖచ్చితంగా రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారన్న నమ్మకం కలుగుతుందంటున్నారు.

ప్రజావేదిక కూల్చివేతపై మాత్రం….

ఇక ప్రజావేదిక కూల్చివేత పై మాత్రం జగన్ నిర్ణయాన్ని సమర్థించడం లేదు. కోట్లు ఖర్చు చేసిన భవనాన్ని ప్రజావసరాలకు ఉపయోగించకుండా కూల్చివేసి ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేశారని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇచ్చిన విషయంలో మాత్రం ఎక్కువ మంది సమర్థించారు. ఆరోగ్య శ్రీని మధ్యతరగతి ప్రజలకు కూడా వర్తింప చేయడంతో జగన్ ను ఆ వర్గం ప్రజలు అభినందిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో తమకు పెద్ద ఆందోళన తప్పిందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు.

రాజధాని నిర్మాణంపై….

అలాగే రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంపై పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తప్ప రాష్ట్రంలో రాజధాని గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. రాజధానిని కేవలం అమరావతికే పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాలకు విస్తృతం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు అధికార వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నారు. పోలవరం రీ టెండర్ల విషయంలోనూ ప్రభుత్వానికి సొమ్ము ఆదా అయితే మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద నాలుగు నెలల జగన్ పాలననై సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదు. జగన్ పాలన పరవాలేదన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News