జగన్ షాట్ కొడితే…?

రాష్ట్రంలో రాజ‌కీయంగా ప‌ట్టుకోసం జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో దూసుకుపోవాల‌ని, ఇప్పుడు మ‌ట్టి క‌రిచిన టీడీపీ, ప‌త్తా లేకుండా పోయిన బీజేపీ వంటి పార్టీల‌ను కోలుకోలేకుండా దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు [more]

Update: 2019-10-07 02:00 GMT

రాష్ట్రంలో రాజ‌కీయంగా ప‌ట్టుకోసం జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో దూసుకుపోవాల‌ని, ఇప్పుడు మ‌ట్టి క‌రిచిన టీడీపీ, ప‌త్తా లేకుండా పోయిన బీజేపీ వంటి పార్టీల‌ను కోలుకోలేకుండా దెబ్బ‌కొట్టాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కంటే ముందుగానే రాష్ట్రంలో వైసీపీ స‌త్తా చాటాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీలో కీల‌క మార్పుల దిశ‌గా అనేక చ‌ర్య‌లు చేప‌ట్టారు. అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. అయితే, ఎన్నిక‌ల అనంతరం పార్టీ అధికారంలోకి రావ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌ల పాల‌న‌తోనే ఆయ‌న‌కు స‌మ‌యం స‌రిపోని విధంగా ఉంది. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

గ్రామాలే యూనిట్లుగా….

ముఖ్యంగా పార్టీలో అనేక మార్పులు, చేర్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. సాధించిన దానికి సంతృప్తి చెంది.. అన్న‌ట్టుగా కాకుండా పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌గ‌న్ ఇటీవ‌లే పార్టీ నాయ‌కుల‌కు తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల‌ను, మండ‌లాల‌ను, ప‌ట్ట‌ణా ల‌ను, కార్పొరేష‌న్ల‌ను యూనిట్లుగా చేసుకుని పార్టీని బ‌లోపేతం చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. అంటే, క్షేత్ర‌స్థాయిలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ఇప్ప‌టికే వ‌లంటీర్లు ప్ర‌చారం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య వార‌ధుల్లాగా నిలుస్తున్నారు.

వారికే పదవులు….

ఈ నేప‌థ్యంలోనే పార్టీని కూడా రంగంలోకి దింపి కీల‌క‌మైన ప‌ద‌వుల‌ను వారికి క‌ట్ట‌బెట్టాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ క్ర‌మంలోనే ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చే నాయ‌కుల కోసం కూడా డోర్లు తెరిచి ఉంచాల‌ని ని ర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఏడాది స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో పెర‌ఫార్మె న్స్‌ను ఈ ఎన్నిక‌ల ద్వారా నిర్ణ‌యించాల‌ని భావిస్తున్నారు. త‌ద్వారా పార్టీ బ‌లోపేతానికి కృషి చేసిన వారికి, చేస్తున్న‌వారికి కూడా ప‌ద‌వులు ఇవ్వాల‌ని జ‌గ‌న్ ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప‌రిణామంతో రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైసీపీ మార్కు మార్పు క‌నిపించ‌డం త‌థ్య‌మ‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌తిపక్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కుంగిపోకుండా అభివృద్ధి బాట‌లో ముందుకు సాగాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించు కున్నారు.

Tags:    

Similar News