జగన్ ప్లాన్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారు. జగన్ తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతూనే మరోవైపు పార్టీ పటిష్టతపైన కూడా దృష్టి [more]

Update: 2019-10-04 08:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నారు. జగన్ తాను అనుకున్నది చేసుకుంటూ వెళుతూనే మరోవైపు పార్టీ పటిష్టతపైన కూడా దృష్టి పెట్టారు. మిషన్ 2024 లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పాలనను ప్రజలకు చేరువ చేయడంతో పాటు తాను ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే దిశగానే జగన్ చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంతకు ముందు జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ఎన్నికలకు ముందు హడావిడి చేస్తే ప్రజలు నమ్మలేదు.

హామీలన్నింటినీ…..

దీంతో ఆ పరిస్థితి తనకు ఎదురుకాకూడదని జగన్ భావిస్తున్నారు. నిధుల కొరత పట్టి పీడిస్తున్నా వెనక్కు తగ్గడం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్థికంగా రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని అధికారులు నస పెడుతున్నప్పటికీ జగన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఏడాది కాలంలోనే పూర్తిగా హామీలు అమలు చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. రెండో ఏడాది నుంచి పూర్తిగా పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్న తీరుతో పాటు పార్టీ పరిస్థితిని కూడా అయన బేరీజే వేసుకోనున్నారు. ఒకవేళ నిజంగా ప్రజలు తన పాలనపై అసంతృప్తితో ఉంటే మార్చుకోవడానికి కూడా జగన్ సిద్ధమయ్యారు. అందుకు జగన్ కు చాలా సమయం ఉండటం కలసి వచ్చే అంశం.

చేరికలకు కూడా….

ఇక ఇతర పార్టీల నుంచి నేతలు వచ్చేందుకు కూడా జగన్ డోర్లు తెరిచేశారు. ఇందుకు ప్రధాన కారణం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని ఖచ్చితంగా తెలియడమే. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గ పునర్విభజన జరిగి అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. దీంతో గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కని వారికి, కొత్తగా పార్టీలో చేరిన వారికి టిక్కెట్లు కేటాయించే వీలు చిక్కుతుంది. తనకు ఈ ఎన్నికల్లో లభించిన 151 స్థానాలను పదిలంగా ఉంచుకునేలా ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకు తగిన కార్యాచరణను రూపొందించాలని పార్టీ సీనియర్ నేతలను ఆదేశించినట్లు తెలిసింది.

ప్రతి నియోజకవర్గాన్ని….

నాలుగేళ్ల కాలంలో 151 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించే ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి జగన్ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేయించాలన్నది పార్టీ నేతల ఆలోచనగా ఉంది. జగన్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారీగా ముఖ్య సమస్యలను గుర్తించడంతో పాటు వాటి పరిష్కారానికి అయ్యే వ్యయాన్ని కూడా అందించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారట. మొత్తం మీద జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలన్న క్లారిటీ తోనే ముందుకు వెళుతున్నారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News