హర్డిల్స్ ఎన్ని ఉన్నా….?

వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడుతోంది. విమర్శలు, ఎదురుదెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఎన్నో విమర్శలను [more]

Update: 2019-09-29 12:30 GMT

వైఎస్ జగన్ సర్కార్ ఇప్పుడిప్పుడే కొంత కుదుట పడుతోంది. విమర్శలు, ఎదురుదెబ్బల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఎన్నో విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొనాల్సి వచ్చింది. అన్ని పథకాలను, ప్రాజెక్టు టెండర్లను రద్దు చేయడం, పాలనపై పట్టు బిగియకపోవడం వంటివి వైఎస్ జగన్ సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టాయనే చెప్పాలి. అయితే క్రమంగా అవి తొలగి పోతున్నాయి. క్రమంగా ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నాయి.

అన్ని విమర్శలు.. అడ్డంకులు…..

వైఎస్ జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఇటు విపక్షాల నుంచి అటు న్యాయస్థానాల నుంచి కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు తప్పని విపక్షాలు రాద్ధాంతం చేశాయి. కొన్ని అంశాల్లో న్యాయస్థానాలూ వైఎస్ జగన్ సర్కార్ కు మొట్టికాయలు వేసింది. అయినా వైఎస్ జగన్ మొండిగానే ముందుకు వెళ్లారు. ఎటువంటి విమర్శలకు జడవకుండా, జవాబివ్వకుండా తన పని తాను చేసుకు వెళ్లారు. అడ్డంకులను ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ వైఎస్ జగన్ వెళుతున్నారు.

సూపర్ సక్సెస్ కావడంతో….

వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్ టెండరింగ్ పై తొలినాళ్లలో విమర్శలు వెల్లువెత్తాయి. తమ అనుయాయులకే కాంట్రాక్టులు కట్టబెట్టడానికని, బేరాలు కుదుర్చుకోవడానికే రివర్స్ టెండరింగ్ ను వైఎస్ జగన్ తీసుకువచ్చారని ముఖ్యంగా టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. అయితే రివర్స్ టెండరింగ్ సూపర్ సక్సెస్ అయింది. ఒక్క పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ లోనే ప్రభుత్వ ఖజానాకు 838 కోట్లు ఆదా అయింది. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వంపై పాజిటివ్ టాక్ వచ్చింది. వచ్చే నవంబరు నెల నుంచే పోలవరం పనులు ప్రారంభం కానున్నాయి.

పార్టీలోనూ జోష్……

ఇక పీపీఏల విష‍యంలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం పాక్షికంగా విజయం సాధించిందనే చెప్పాలి. పీపీఏలపై సమీక్ష చేేందుకు వీలులేదని ఇటు విపక్షం, అటు కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పింది. అయినా వైఎస్ జగన్ మొండిగానే వెళ్లారు. విద్యుత్తు కంపెనీలు కూడా కోర్టును ఆశ్రయించాయి. కానీ న్యాయస్థానం మాత్రం సమీక్షను సమర్థించింది. దీంతో జగన్ పీపీఏల సమీక్షకు సిద్ధమవుతున్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగల పరీక్షల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపనలు వచ్చాయి. అయితే ఒకేసారి లక్షా ముప్ఫయి వేల పోస్టులు భర్తీ చేస్తుండటంతో యువతలో మంచి జోష‌ నెలకొంది. మొత్తం మీద జగన్ అన్ని హర్డిల్స్ ను దాటుకుని ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వానికి పాజిటివ్ టాక్ క్రమంగా వస్తుండటంతో వైసీపీ నేతలు ఆనందంలో ఉన్నారు.

Tags:    

Similar News