జగన్ ఇలాగే వెళితే….?

రాష్ట్రం కొత్తగా ఏర్పడింది…….. ఇంకా పూర్తిగ రాజధాని లేదు… జగన్ కు ఏం అనుభవం ఉంది పాలించడానికి …. తండ్రి మరణించినప్పటి నుంచి సీఎం కావాలంటూ పరితపిస్తున్నాడు…. [more]

Update: 2019-09-21 14:30 GMT

రాష్ట్రం కొత్తగా ఏర్పడింది…….. ఇంకా పూర్తిగ రాజధాని లేదు… జగన్ కు ఏం అనుభవం ఉంది పాలించడానికి …. తండ్రి మరణించినప్పటి నుంచి సీఎం కావాలంటూ పరితపిస్తున్నాడు…. అంటూ అందరూ ఆయనను దూషించారు. కాని జగన్ మాత్రం తండ్రి రాజశేఖర్ రెడ్డి బాటలో నడిచారు. పాదయాత్రలు, ఓదార్పు యాత్రలతో ప్రజలకు చేరువయ్యాడు. ఎన్నో ఏళ్ల కలను సొంతం చేసుకున్నాడు. డైనమిక్ డెసిషన్లతో ముందుకు సాగుతున్నాడు. అతడే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి. వందరోజుల పాలనలో కీలకనిర్ణయాలు తీసుకుంటూ ఇటూ పక్క రాష్ట్రమైన తెలంగాణకూ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

కుర్రాడు ఏం చేస్తాడు…..?

జగన్….. కుర్రాడు ఆయనకేం తెలుసు. ఇది ఒకప్పటి మాట. జగన్ అబ్బో అన్నాడా అయితే చేసేస్తాడు….. ఇది ఇప్పటి మాట. రాజకీయాల్లో ఆరితేరిన తలపండితులు సైతం ఇప్పుడు జగన్ పేరు చెబితే అవాక్కయిపోతున్నారు. వందరోజుల పాలనలోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ వావ్ అనిపిస్తున్నాడు.

ఆర్టీసీని విలీనం చేసి….

జగన్ సర్కార్ ప్రజల రవాణా కోసం ఏర్పడిన ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయనున్నట్లు వెల్లడించింది. దీనిపై కమిటీని నియమించింది. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే క్యాబినెట్ స‌మావేశంలో దానికి ఆమోదం తెలిపింది. 70 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలోనూ ఎంతో మంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్లు వచ్చాయి. కాని ఎవరూ ధైర్యం చేయలేదు. కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకోవడమంటే మాటలా అంటూ అందరూ ముక్కున వేలేసుకున్నారు. కాని జగన్ మాత్రం ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రకటించడాన్ని అందరూ హర్షిస్తున్నారు. ఆర్టీసీలో 128 డిపోలు, 4 యూనిట్లలో 52 వేల మంది సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ 12వేల బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. జగన్ నిర్ణయంతో వేలాది కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వైద్యులపై కొరఢా….

ప్రభుత్వ వైద్యులు….. అంటే ఎలా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ విధులకు తక్కువ, సొంత క్లినిక్ లకు ఎక్కువ అనే ఆరోపణలు ఏళ్లతరబడి వస్తూనే ఉన్నాయి. వందలాది మంది నిరుపేదలు ఆసుపత్రులకు వస్తే అత్యవసర సమయంలోనూ డాక్టర్లు లేక అల్లాడిపోతున్న సంఘటనలు, విధులకు వైద్యులు సక్రమంగా రావడం లేదనే ఆరోపణలు సీఎం జగన్ ను కలిచి వేశాయి. తండ్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన కుయ్…..కుయ్….. అంటూ నిమిషాల్లోనే ఇంటికి వచ్చే అంబులెన్సుల్లా సేవలందించాలనుకున్నాడు. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ సుజాతరావు కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులను జగన్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. వారు సూచించిన ప్రధానమైన విషయం ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ . అంతే జగన్ దానిపై రాజముద్ర వేశారు. ప్రభుత్వ వైద్యులెవరూ సొంత ప్రాక్టీస్ లు చేయ్యెద్దటూ మరో డైనమిక్ డిషిషన్ తీసుకుని ఆశ్చర్యపరిచారు.

వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ….

సుజాతరావు సిఫార్సుల మేరకు పేదలకు వైద్యం అందించేందుకు మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా జనవరి 1 నుంచి కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ అమలు కానుంది. పైలట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లాలో 2 వేల వ్యాధులను ఆరోగ్య శ్రీలోకి తీసుకురానున్నారు. మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చనున్నారు. ఆపరేషన్‌ చేయించుకున్నవారు కోలుకునేంత వరకూ నెలకు రూ.5వేల చొప్పున సహాయం అందించనుంది ప్రభుత్వం వెయ్యి రూపాయలు దాటితే ఏ వ్యాధికైనా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

జగన్ నిర్ణయాలతో ఇబ్బంది…..

ఆంద్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు ఒకప్పటి పొరుగు రాష్ట్రాలే. ఒకప్పటి ఉమ్మడి రాష్ట్రం. ఏపీకి మొదటి ఐదేళ్లు చంద్రబాబు సీఎంగా ప్రజలు ఎన్నుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ కు పట్టం కట్టారు. మళ్లీ మూడు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు నిర్ణయాన్ని మార్చుకున్నారు. మార్పు రావాలని సీఎంగా జగన్ కు పట్టాభిషేకం చేస్తే…. తెలంగాణలో మాత్రం యాస్ యూజ్ వల్ గా కేసీఆర్ కే పట్టం కట్టారు. సరే ఇదంతా ఇలా ఉంటే జగన్ నిర్ణయాలు కొందరు తెలంగాణ నేతలకు మింగుడు పడడం లేదు. ఏపీలో అక్కడి కార్మికులు సమ్మెనోటీసు ఇవ్వగానే జగన్ చర్చలు జరిపి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. ఇదే పంధాలో తెలంగాణలోనూ ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులను ఇచ్చారు. కాని తెలంగాణ ప్రభుత్వం మాత్రం నామమాత్రపు చర్చలు జరిపి చేతులు దులుపుకుంది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గత నెల రోజులుగా తెలంగాణలో విషజ్వరాలు, డెంగ్యూ వంటి రోగాలతో ప్రభుత్వం ఆసుపత్రులు కిక్కిరిసి పోయాయి. వైద్యులు సరిగ్గా చూడడం లేదని రోగులు మండిపడుతున్నారు. మందులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఏపీలో ప్రభుత్వం వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ పై నిషేధం విధించడంతో తెలంగాణలో వైద్యులకు భయం పట్టుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలా చేస్తుందానని చర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News