నలుగురేనా? ఇలా అయితే ఎలా?

ఏపీలో కొలువుదీరిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వంద రోజులు పూర్త‌య్యాయి. అనేక వ్య‌య‌ప్ర‌యాస‌ల అనంత‌రం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అంద‌రూ ఇక‌, ఏపీలో [more]

Update: 2019-09-19 14:30 GMT

ఏపీలో కొలువుదీరిన జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వంద రోజులు పూర్త‌య్యాయి. అనేక వ్య‌య‌ప్ర‌యాస‌ల అనంత‌రం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అంద‌రూ ఇక‌, ఏపీలో రెడ్డి రాజ్యం ఏర్ప‌డు తుంద‌ని అనుకున్నారు. దీనికి ఉదాహ‌ర‌ణ కాసు బ్ర‌హ్మానంద‌రెడ్డి కేబినెట్‌ను కూడా తెర‌మీదికి తెచ్చారు. ఉమ్మ‌డి ఏపీలో కాంగ్రెస్ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన కాసు.. త‌న కేబినెట్‌లో లెక్కకు మిక్కిలిగా రెడ్డి వ‌ర్గానికి చెందిన వారినే నియ‌మించుకుని వార్త‌ల్లోకి ఎక్కారు. ఇప్పుడు ఏపీలోనూ ఇదే త‌ర‌హా పాల‌న ఉంటుంద‌ని అనుకున్నారు. అయితే, దీనికి భిన్నంగా జ‌గ‌న్ అడుగులు వేశారు.

సోషల్ ఇంజినీరింగ్ ను…

సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌ను అడుగ‌డుగునా పాటించారు. అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. మ‌హిళ‌ల‌కు కూడా కీల‌క పోస్టులు ఇచ్చి మంత్రులుగా త‌న కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారు. ముగ్గురు మంత్రుల‌కు జ‌గ‌న్ కేబినెట్లో చోటు ద‌క్క‌గా వీరిలో ఇద్ద‌రు డిప్యూటీ సీఎంలు కూడా ఉన్నారు. అయితే, ఇప్పుడు ఈ మంత్రులు జ‌గ‌న్ వ్యూహాల‌కు అనుగుణంగా ముందుకు సాగుతున్నారా ? మేనిఫెస్టో అమ‌లులో ఏమేర‌కు వారు దూసుకుపోతున్నారు? అనే చ‌ర్చ తెర‌మీద‌కివ‌చ్చింది. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఏమేర‌కు కౌంట‌ర్లు ఇస్తున్నారు? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మొత్తం 27 మంది మంత్రుల్లో కేవ‌లం న‌లుగురైదుగురు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కొందరే యాక్టివ్ గా…..

జగన్ కేబినెట్ లో సీనియర్ మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, పిల్లి సుభాష్‌ చంద్ర‌బోస్‌, కొడాలి నాని, మేక‌తోటి సుచ‌రిత, అనిల్ కుమార్ యాద‌వ్‌ వంటివారు దూకుడుగా ఉన్నారు. పాల‌నా ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలోను, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌తిప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు కౌంట‌ర్లు ఇవ్వ‌డంలోను కూడా వీరు ముందున్నారు. మంత్రులు ఆదిమూల‌పు సురేష్‌, కుర‌సాల క‌న్న‌బాబు, మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ వంటివారు కూడా త‌ర‌చుగా మీడియాలో ఉంటున్నా.. కేవ‌లం వారి వారి శాఖ‌ల‌కు సంబంధించిన ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డంతోనే స‌రిపెడుతున్నారు.

బుగ్గన సయితం…..

కానీ, ప్ర‌తిప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మాత్రం క‌ల్పించుకోవ‌డం లేదు. ఇక‌, డిప్యూటీ సీఎంలుగా ఉన్న న‌లుగురిలో సుభాష్ చంద్ర‌బోస్, సుచ‌రిత‌ మాత్రం యాక్టివ్‌గా స్పందిస్తున్నారు. ఆళ్ల నాని, శ్రీవాణి, అంజాద్ బాషా ఏం మాట్లాడ‌డం లేదు. శ్రీవాణి, అంజాద్ బాషా అస‌లేం చేస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితి. బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి జ‌గ‌న్‌కు రైట్ హ్యాండ్‌గా ఉన్నా పెద్ద‌గా స్పందించ‌డం లేదు.బాలినేని, మేక‌పాటి, శంక‌ర్ నారాయ‌ణ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటూ అంత మంచిది. గుమ్మూరు జ‌య‌రాం, చెరుకువాడ రంగ‌నాథ‌రాజు, తానేటి వనిత కూడా వాయిస్ వినిపించ‌డం లేదు. ఏదేమైనా జ‌గ‌న్ కేబినెట్‌లో న‌లుగురైదుగురు మాత్ర‌మే యాక్టివ్‌గా ఉంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News