జగన్ ఓవర్ రియాక్ట్ అయ్యారా?

పల్నాడు వ్యవహారంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఓవర్ రియాక్ట్ అయిందనే చెప్పాలి. చూసీ చూడనట్లు వదిలేసుంటే తెలుగుదేశం పార్టీకి ఇంత మైలేజీ వచ్చేది కాదని సొంత పార్టీ [more]

Update: 2019-09-11 12:30 GMT

పల్నాడు వ్యవహారంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఓవర్ రియాక్ట్ అయిందనే చెప్పాలి. చూసీ చూడనట్లు వదిలేసుంటే తెలుగుదేశం పార్టీకి ఇంత మైలేజీ వచ్చేది కాదని సొంత పార్టీ నేతలే అభిప్రాయపడుతుండటం విశేషం. నిజానికి చంద్రబాబు నాయుడు పన్నిన ట్రాప్ లో జగన్ సర్కార్ పడినట్లే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు కు వంద రోజుల పాలనలో ఎలాంటి కారణాలు ఆందోళన చేయడానికి చిక్కలేదు. పోలవరం, అమరావతి టెండర్లను రద్దు చేసినా దానిపై నోరు మెదపలేని పరిస్థితి. అలాగే కోడెల శివప్రసాద్, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావులపై కేసులు నమోదు చేసినా చంద్రబాబు ఖండించలేని పరిస్థితి.

ఏం ఆందోళనకు దిగినా….

ఇక అన్నాక్యాంటీన్లు మూసి వేశారంటూ చంద్రబాబు ఆందోళనకు పిలుపు నిచ్చినా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటులో అవినీతి జరిగిందంటూ వైసీపీ ఎదురుదాడికి దిగడందో ఆ అంశాన్ని పక్కనపెట్టారు. తర్వాత ఇసుక కొరతను తీసుకున్నారు. అన్ని ప్రాంతాల్లో ధర్నాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమానికి కూడా నేతలు, కార్యకర్తల నుంచి స్పందన అంతంత మాత్రంగానే వచ్చింది. మరోవైపు జగన్ సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేసే పనిలో పడ్డారు.

రణవ్యూహాన్ని మార్చి….

అందుకే చంద్రబాబు రణవ్యూహాన్ని మార్చారు. పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయంటూ ఇష్యూను టేకప్ చేశారు. తొలుత 174 కుటుంబాలతో శిబిరాన్ని గుంటూరు లో ఏర్పాటు చేశారు. అక్కడే వారికి అన్ని సదుపాయాలు కల్పించారు. టీడీపీకి ఓటు వేసిన వారిని వైసీపీ నేతలు వేధిస్తున్నారని, అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తానే దగ్గరుండి వారిని గ్రామాలకు తీసుకెళ్తానని చంద్రబాబు ప్రకటించి చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. నిజానికి పల్నాడు ప్రాంతంలో ఇవి కొత్తేమీ కాదు. గతంలోనూ టీడీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలు ఊళ్లను విడిచి వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అప్పట్లో కూడా జగన్ ఇదే అంశంపై ఆందోళనకు దిగారు.

ట్రాప్ లో పడినట్లేనా?

పల్నాడు ఇష్యూలో మాత్రం చంద్రబాబు ట్రాప్ లో వైసీపీ పడినట్లే కన్పిస్తుంది. చలో ఆత్మకూరు కార్యక్రమానికి అవకాశమిచ్చి ఉంటే సరిపోయేదన్న వ్యాఖ్యలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. ఈ అరెస్ట్ లతో చంద్రబాబు హైలెట్ అయ్యారని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అరెస్ట్ లతో రగడ చేసుకున్నామని ఒప్పుకుంటున్నారు. చంద్రబాబును వదిలేసి ఉంటే అక్కడకు వెళ్లి ఒక మీటింగ్ పెట్టుకుని వెళ్లేవారని, తమ అరెస్ట్ ల వ్యూహం బెడిసికొట్టిందన్నది వైసీపీ నేతల అభిప్రాయంగా విన్పిస్తుంది. మొత్తం మీద పల్నాడు ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపులోనే ఉన్నారాజకీయపార్టీలు మాత్రం ఉండనిచ్చేటట్లు లేదు.

Tags:    

Similar News