మోదీ రోల్ మోడల్ లాగుందే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేమ్ టు సేమ్ మోదీ తరహాలోనే పాలన చేస్తున్నారు. మోదీ వ్యవహరించిన తీరునే జగన్ అనుసరిస్తున్నారా?అన్న అనుమానం కలుగుతున్నాయి. నరేంద్ర [more]

Update: 2019-09-29 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేమ్ టు సేమ్ మోదీ తరహాలోనే పాలన చేస్తున్నారు. మోదీ వ్యవహరించిన తీరునే జగన్ అనుసరిస్తున్నారా?అన్న అనుమానం కలుగుతున్నాయి. నరేంద్ర మోదీ వైఎస్ జగన్ కు మార్గదర్శిగా కన్పిస్తున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలే ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుండటం విశేషం. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. పాత కేసులన్నీ వెలికి తీసి ఒక్కొక్కరుగా తీహార్ జైలుకు పంపుతుంది.

ఒక్కొక్కరుగా జైల్లోకి….

ఇప్పటికే కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం, కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ జైలుకు వెళ్లారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాధ్ మేనల్లుడు ఊచలు లెక్కేస్తున్నారు. ఇటీవల శరద్ పవార్ పై కూడా మనీ లాండరింగ్ కేసు నమోదయింది. ఇలా వరస పెట్టి కాంగ్రెస్ అగ్రనేతలను, ఎన్నికల్లో ప్రభావితం చేయగలిగిన నేతలను మోదీ ప్రభుత్వం జైలుకు పంపుతోంది. దీంతో మానసికంగా ఆ పార్టీ నేతలను దెబ్బ తీసేందుకు బీజేపీకి ఉపయోగపడిందనే చెప్పాలి. సేమ్ అదే పరిస్థితిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది.

పాత కేసులతో పాటు….

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరసగా తెలుగుదేశం నేతలను టార్గెట్ చేసింది. పాత కేసులతో పాటు కొత్త కేసులు కూడా టీడీపీ నేతలపై నమోదవుతున్నాయి. కోడెల శివప్రసాద్, చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై పాత కేసులను తిరగదోడింది జగన్ సర్కార్. ఇక కూన రవికుమార్, అయ్యన్న పాత్రుడు, విష్ణువర్థన్ రెడ్డి, కరణం బలరాం వంటి వారిపై కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో టీడీపీ నేతలు విలవిల లాడిపోతున్నారు. వారు న్యాయస్థానాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు.

మోదీ లాగానే….

ఎన్నికలకు ముందు వైసీపీ నేతలపైనే ఇలాగే ఏపీలో కేసులు నమోదయ్యాయి. అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్కేరోజా, అంబటి రాంబాబు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వంటి వారిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రాగానే టీడీపీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. మొత్తం మీద జాతీయ స్థాయిలో రెండోసారి ప్రధాని అయిన మోదీ విపక్షాన్ని లేకుండా చేయాలని చూస్తుంటే, మొదటి సారి ముఖ్యమంత్రి అయిన జగన్ టీడీపీని కూకటి వేళ్లతో పెకలించాలని చూస్తున్నారు.ఈ విషయంలో మాత్రం జగన్ కు మోదీ రోల్ మోడల్ గానే కన్పిస్తున్నట్లుంది. అంతే కాకుండా మోదీ లాగానే జగన్ కూడా ఏ విషయంపై స్పందించారు. మీడియాకు దూరంగా ఉంటున్నారు. మోదీ స్ట్రాటజీనే జగన్ ఫాలో అవుతున్నట్లుంది.

Tags:    

Similar News