జగన్ ఎడిక్ట్ చేస్తున్నారు…? బాబుకు వేరే మార్గం లేదా?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పని తాను సాఫీగా చేసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను మాత్రం ఆపడం లేదు. ఖజానా ఖాళీ అవుతున్నా రెండోరోజులకొక పథకాన్ని [more]

Update: 2020-09-03 08:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన పని తాను సాఫీగా చేసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను మాత్రం ఆపడం లేదు. ఖజానా ఖాళీ అవుతున్నా రెండోరోజులకొక పథకాన్ని జగన్ ప్రకటిస్తూ పోతున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో నగదును జమ చేస్తన్నారు. నియోజకవర్గాలకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు సయితం అసంతృప్తిలో ఉన్నారు. ఒకవైపు కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లేందుకు కూడా నిధులు లేవు. నియోజకవర్గ నిధులను నిలిపి వేసిన జగన్ అదే సమయంలో సంక్షేమ పథకాలను మాత్రం ఆపడం లేదు.

అధికారంలోకి వచ్చిన నాటి నుంచే….

దీనికి కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగదును ప్రజల్లో ఖాతాల్లోకి వివిధ పథకాల రూపంలో పంపుతున్నారు. వరసగా ప్రతి ఏడాది నిర్దేశించిన సమయం ప్రకారం డబ్బులు వారి బ్యాంకు అకౌంట్లో పడితే దానికి ప్రజలు అలవాటు పడతారు. నిధులు విడుదలయ్యే నెల కోసం ఎదురు చూస్తుంటారు. అంటే ప్రభుత్వం ఇచ్చే నిధులు తీసుకున్నా లబ్దిదారులు మరచిపోరు.

నగదును నెల వారీగా అలవాటు చేసి….

ఇలా అలవాటయితే వచ్చే ఎన్నికల నాటికి వీరంతా వైసీపీ వైపు నిలబడతారన్న గట్టి నమ్మకంతో జగన్ ఉన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు నిర్దిష్ట సమయంలో అనుకున్న క్యాలెండర్ ప్రకారం వివిధ పథకాల ద్వారా నేరుగా డబ్బులు జమ అయితే జనం పార్టీకి ఎడిక్ట్ అవుతారని అంచనాలో ఉన్నారు. అందుకే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే లెక్కకు మిక్కి పథకాలను ప్రవేశపెట్టి నగదును లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 65 వేల కోట్లను ఇలా పంపిణీ చేశారు.

బాబు వస్తే పథకాలుండవనీ…..

చంద్రబాబు వస్తే తిరిగి ఈ పథకాలు ఉండవని ఎన్నికల సమయానికి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే అవకాశం జగన్ పార్టీకి ఉంటుంది. దానిని జనం కూడా సులువుగా నమ్మే వీలుంది. తమకు కష‌్ట సమయాల్లో వచ్చి పడుతున్న నగదును ఎవరూ కాదనుకోవడానికి ఇష్టపడరు. ఆ వీక్ నెస్ తమకు ప్రయోజనం చేకూరుతుందని, చంద్రబాబు ఎన్ని హామీలిచ్చినా ప్రజలు నమ్మరని, జగన్ నగదు బదిలీయే తమకు మరోసారి ఓట్ల వర్షం కురిపిస్తుందన్న దీమాలో ఉన్నారు. నాలుగేళ్లు ఇదే విధంగా నగదు బదిలీ జరిపితే ఇక తమకు తిరుగుండదన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు.

Tags:    

Similar News