జగన్ ముందు తేలిపోతున్నారా…?

సంకల్పం ఉండాలంటారు. అది గట్టిగా ఉండాలని కూడా చెబుతారు. అపుడు అసాధ్యమైనా సుసాధ్యమేనని అంటారు. జగన్ లో మొండితనం ఉందని అన్నా అది పట్టుదలగా సానుకూలంగా ఆలోచించే [more]

Update: 2019-10-02 06:30 GMT

సంకల్పం ఉండాలంటారు. అది గట్టిగా ఉండాలని కూడా చెబుతారు. అపుడు అసాధ్యమైనా సుసాధ్యమేనని అంటారు. జగన్ లో మొండితనం ఉందని అన్నా అది పట్టుదలగా సానుకూలంగా ఆలోచించే వారు అంటారు. ఇపుడు అదే పనికివస్తోంది. ఏ పని చేయాలనుకున్నా జగన్ దూకుడుగా వెళ్తారు. అది అయ్యేవరకూ నిద్రపోరు. మే 30న జగన్ ప్రమాణం చేస్తూ కొన్ని డేట్స్ చెప్పారు. ఆగస్ట్ 15 నాటికి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, అక్టోబర్ 2 నాటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు అన్నారు. లక్షలాది ఉద్యోగాలు కూడా తీస్తామని జ‌గన్ ప్రకటించారు. అదే వేదిక మీద ఉన్న తెలంగాణా సీఎం కేసీఆర్ తో సహా ఎవరూ నాడు ఈ ప్రకటనలు నమ్మలేదు. ఇపుడు అదే నిజం చేసి చూపించారు జగన్. దాదాపుగా లక్షలాది ఉద్యోగాలు వార్డు, గ్రామ సచివాలయాలకు ఇచ్చారు. అదే విధంగా మరో రెండున్నర లక్ష్ల మంది గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు కూడా ఇంతకు ముందే భర్తీ చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక రికార్డు గా చెబుతున్నారు. ఓ వైపు ఆర్ధిక మాంద్యం ఉన్న పరిస్థితి. ఉన్న ఉద్యోగాలకే దిక్కు లేదు. అలాంటిది కొత్త ఉద్యోగాలు తీయడం, అది కూడా లక్షల్లో అంటే దేశం మొత్తం ఏపీ వైపుగా చూస్తోంది.

కేసీఆర్ లక్ష ఉద్యోగాలు …

అసలు తెలంగాణా ఉద్యమం పుట్టిందే నీళ్ళు, నిధులు, ఉపాధి కోసం. నీళ్ళు విషయంలో కేసీఆర్ ఒడిసిపడుతున్నారు. ప్రాజెక్టులు కడుతున్నారు. నిధుల విషయంలోనూ కధ బాగానే ఉంది. మరి ఉపాధి ఏదీ. తెలంగాణా వస్తే సర్కార్ కొలువుల్లో కుదురుకుపోవచ్చునని లక్షలాదిమంది నిరుద్యోగ యువత నాడు ఎంతో ఆశగా ఎదురుచూసింది. ఉద్యమంలో కూడా దూకింది. కానీ కేసీఆర్ సర్కార్ ఏర్పడి ఆరేళ్ళు అవుతున్నా ఎన్ని ఉద్యోగాలు తీశారంటే అచ్చంగా 35 వేలు మాత్రమేనట. అంటే కేసీఆర్ పాలన ఇన్నాళ్ళు సాగినా లక్ష ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. అలాంటిది పొరుగున ఉన్న వైఎస్ జగన్ సర్కార్ నాలుగు నెలల్లో ఒకేసారి లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే కేసీఆర్ ఓ విధంగా చిన్నబోయినట్లే. ఇదే ఇపుడు తెలంగాణావ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇక ఇంతటితో జగన్ వూరుకోరు కదా. ప్రతీ ఏడాది జనవరి నెలలు రిక్రూట్ మెంట్ మంత్ గా పెట్టి మరీ అన్ని ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని చెబుతున్నారు. ఇది కూడా అమలైతే దేశంలో ఏ రాష్ట్రం కూడా జగన్ రికార్డు అందుకోలేదేమో.

మోడీ కోటి ఉద్యోగాలన్నారు…..

ఇక రాష్ట్రాలేవీ జగన్ చేసినట్లుగా లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వలేకపోయాయి. తలపండిన రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట కూడా ఉద్యోగాలు లేవు. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్రంలో 2014లో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఆనాడు ఇచ్చిన హామీ ఏంటి అంతే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని. మరి అయిదేళ్ళ తొలి పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటే కేంద్రం వద్ద సమాధానం లేదు. మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పటివరకూ కొత్తగా ఉపాధి కల్పన మీద కేంద్రం దృష్టి పెట్టలేదు. ఈ సమయంలో ఏపీలో జగన్ ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అంటే కేంద్రం కూడా చిన్నబుచ్చుకోవాల్సిందే మరి.

Tags:    

Similar News