జ‌గ‌న్ రాంగ్ డెసిష‌న్ తీసుకున్నారా..?

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ సీటుకు వైసీపీ అభ్యర్ధిని ఎంపిక చేసేంది. ఇక్కడ టికెట్ కోసం సాగుతున్న వర్గ పోరుకు ఓ విధంగా పార్టీ [more]

Update: 2019-02-10 08:00 GMT

విజయనగరం జిల్లా పార్వతీపురం ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ సీటుకు వైసీపీ అభ్యర్ధిని ఎంపిక చేసేంది. ఇక్కడ టికెట్ కోసం సాగుతున్న వర్గ పోరుకు ఓ విధంగా పార్టీ హై కమాండ్ తెర దించేసింది. పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో అలజంగి జోగారావు పోటీ చేయడం ఖాయమైంది. ఆయనకే పార్టీ టికెట్ ఖరార‌య్యిందని పార్టీ వర్గాల సమాచారం. దీంతో రెండవ వర్గానికి చెందిన జమ్మాన ప్రసన్న కుమార్ నిరాశలో మునిగిపోయారు. ఇక పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జయమణి లాంటి వారు పక్క చూపులు చూస్తున్నట్లు భోగట్టా. మొత్తానికి పార్వతీపురం వైసీపీ అభ్యర్ధి ఎవరన్నది పార్టీ ప్రకటించేశాక అసలు కథ ఇప్పుడే ఆరంభం అవుతుందని అంటున్నారు.

గెలుపు గుర్రమేనా

పార్టీ ఎంపీక చేసిన అలజంగి జోగారావు గెలుపు గుర్రమేనా అన్నది ఇపుడు చర్చగా ఉంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే అలజంగికి కేవలం ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో వైసీపీ తరపున నాడు పోటీ చేసిన జమ్మాన ప్రసన్నకుమార్ కి 56329 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ తరపున గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేబొబ్బిలి చిరంజీవులును ప్రసన్న కుమార్ గడగడలాడించారు. కేవలం 6,129 మెజారిటీతో మాత్రమే టీడీపీ ఇక్కడ గెలిచినట్లైంది. మొత్తం మూడు మండలాలు, మునిసిపాలిటీల్లో మెజారిటీ ప్రాంతాల్లో బలమున్న జమ్మానను రెండేళ్ల క్రితం పార్టీ ఇంచార్జి పదవి నుంచి తొలగించి అలజంగి జోగారావుకి అప్పగించింది. అయితే నాటి నుంచి ఇద్దరూ పార్టీలో రెండు వర్గాలు ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్నారు. తనకు చివరి నిముషంలోనైనా టికెట్ ఇస్తారని ప్రసన్న కుమార్ ఆశ పడ్డారు. కానీ అలజంగికి ఉన్న జిల్లా పార్టీ పెద్దల మద్దతుతో టికెట్ దక్కించుకున్నారు.

జనసేన వైపా

ఈ పరిణామాల‌తో బలమైన క్యాండిడేట్ గా ఉన్న జమ్మాన చూపు జనసేన వైపు పడిందన్న టాక్ నడుస్తోంది. ఆయన తనకున్న బలానికి జనసేన గ్లామర్ తోడు చేసుకుని గెలుపు బావుటా ఎగరేయగలనని ధీమాగా ఉన్నారు. ఇక పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే జయమణి టీడీపీలో చేరడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. దీంతో వైసీపీలో బలం మూడు ముక్కలైపోతుందని అంటున్నారు. మరి ఈ పరిణామాలతో వైసీపీ ఇక్కడ ఎలా విజయం సాధించగలదన్న అనుమానాలు క్యాడర్లో ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News