ఇక జగన్ శంఖారావం …

వైఎస్ జగన్ మరో శంఖారావానికి సిద్ధం అవుతున్నారు. ఈ శంఖారావాన్ని ఆయన బూత్ లెవెల్ క్యాడర్ తో పూరించనుండటం విశేషం. సుదీర్ఘ పాదయాత్ర తరువాత కొంత విరామం [more]

Update: 2019-02-06 03:28 GMT

వైఎస్ జగన్ మరో శంఖారావానికి సిద్ధం అవుతున్నారు. ఈ శంఖారావాన్ని ఆయన బూత్ లెవెల్ క్యాడర్ తో పూరించనుండటం విశేషం. సుదీర్ఘ పాదయాత్ర తరువాత కొంత విరామం తీసుకుని పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి పెట్టారు వైసిపి చీఫ్. పార్టీ బలోపేతంపై నేతల నుంచి వచ్చిన సూచనల నేపథ్యంలో అంతర్గత బలగాలను యుద్ధానికి సన్నద్ధం చేసే ప్రక్రియ చేపట్టారు జగన్. క్షేత్ర స్థాయిలో బలంగా లేకుండా ఎంతటి ప్రచారం సాగించినా గత ఎన్నికల్లోలా దెబ్బలు తింటామన్న హెచ్చరికలతో జగన్ ఈ అంశంపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.

అన్న పిలుపు పనిచేస్తుందా …?

జగన్ అన్న పిలుపు అనే కార్యక్రమం ద్వారా బూత్ లెవెల్ క్యాడర్ తో నేరుగా కలుస్తారు వైసిపి అధినేత. ఇటీవల కాలంలో ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నుంచి అన్ని పార్టీల అధినేతలు బూత్ లెవెల్ వారితో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరుగా ముఖా ముఖి కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో ముందంజలోనే వుంది. నిత్యం అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించే చంద్రబాబు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడే విధానం టిడిపిలో ఎప్పటినుంచో అమలు చేస్తూ వస్తున్నారు. సుదీర్ఘ పాదయాత్ర కారణంగా పార్టీ క్యాడర్ కి చాలా కాలంగా దూరమైన జగన్ క్రింది స్థాయి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ తో బాటు కీలకమైన వారితో సమావేశం కావడం ద్వారా వారిలో జోష్ పెంచే కార్యక్రమానికి ఈనెల 7 నుంచి శ్రీకారం చుట్టనుండటం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుండటం తో వైసిపి లో కొత్త ఉత్సహం కనిపిస్తుంది.

Tags:    

Similar News