చంద్రబాబుకు జగన్ గిఫ్ట్ రెడీ చేసేసినట్లేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తుండటంపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మండి పడుతున్నారు. కరోనా కష్ట సమయంలోనూ ఎల్లో టీమ్ తమపై చేస్తున్న [more]

Update: 2020-05-14 15:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తుండటంపై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మండి పడుతున్నారు. కరోనా కష్ట సమయంలోనూ ఎల్లో టీమ్ తమపై చేస్తున్న ఆరోపణలను వారు సహించలేక పోతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో కొందరు పార్టీ అధినేత జగన్ పై వత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలని వారు జగన్ పై ప్రెజర్ పెడుతున్నారని సమాచారం.

మరో నలుగురు ఎమ్మెల్యేలు….

తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా చంద్రబాబుకు లభించింది. అయితే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాంలు అధికారికంగా పార్టీలో ఉన్నప్పటికీ అనధికారికంగా లేనట్లే. వీరితో పాటు మరో నలుగురిని తమ వైపునకు తిప్పుకోగలిగితే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా పోతుంది. అందుకోసమే మరో నలుగురు ఎమ్మెల్యేలకు వల వేయాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలిసింది.

కరోనా వైరస్ కారణంగా….

మొన్నటి వరకూ ఆపరేషన్ టీడీపీని జరిపిన వైసీపీ కరోనా వైరస్ కారణంగా దానిని పక్కన పెట్టింది. మాజీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకుంటోంది. కానీ కొత్తగా మరో 15 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీీపీ సీనియర్ నేత ఒకరు చెబుతున్నారు. అయితే వీరింలో కొంతమందికి పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని ఆయన చెబుతుండటం విశేషం. వీరు పార్టీ కండువా కప్పుకుంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా గల్లంతుకాక తప్పదు.

ప్రతిపక్ష హోదాకు…..

జగన్ ప్రభుత్వం ఏడాది పూర్తయిన వెంటనే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎర్త్ పెట్టేయాలని వైసీపీ నేతలు వత్తిడి తెస్తున్నారు. ఏడాది పూర్తయిన పాలనకు చంద్రబాబు గిఫ్ట్ ఇచ్చినట్లవుతుందని కూడా కొందరు సూచిస్తున్నారు. అయితే కరోనా వైరస్ తగ్గుముఖం పట్టగానే జగన్ తిరిగి ఆపరేషన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. నిత్యం తనపై విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు మౌనంగానే గట్టి జవాబు ఇవ్వాలని జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఏడాది పాలన పూర్తయిన వెంటనే చంద్రబాబుకు జగన్ గిఫ్ట్ ఇవ్వనున్నారన్న టాక్ వైసీపీలో బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News