వ్యూహం బెడిసి కొడితే?

ఏపీలో మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న సీఎం జ‌గ‌న్ నోటి నుంచి రావ‌డ‌మే ఆల‌స్యం ప్రధాన రాజ‌కీయ ప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో [more]

Update: 2020-01-06 13:30 GMT

ఏపీలో మూడు రాజ‌ధానుల ప్రక‌ట‌న సీఎం జ‌గ‌న్ నోటి నుంచి రావ‌డ‌మే ఆల‌స్యం ప్రధాన రాజ‌కీయ ప‌క్షాలు తీవ్ర ఆందోళ‌న‌కు దిగిన విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో ప్రస్తుత రాజ‌ధాని అమ‌రావ‌తిలో నూ ప్రజలు రోడ్లపైకి ఎక్కారు. అయితే, తాము తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఎప్పటిక‌ప్పుడు స‌మ‌ర్ధించుకుంటూనే ఉంది. అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగానే తాము మూడు రాజ‌ధానుల విష‌యాన్ని భుజాన వేసుకున్నామని.. గ‌త ప్రభుత్వం మాదిరిగా ఒక సామాజిక వ‌ర్గానికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే ల‌బ్ధి చేకూర్చే ప్ర‌య‌త్నం తాము చేయ‌డం లేద‌ని చెప్పుకొస్తున్నారు.

సాధ్యమేనా? అని…..

ఇక‌, ఈ విష‌యం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మూడు రాజ‌ధానుల‌పై దేశంలోనూ చ‌ర్చ న‌డుస్తోంది. స‌మ‌ర్ధించేవారు మౌనంగా ఉండ‌గా.. వ్యతిరేకించేవారు రోడ్డెక్కుతున్నారు. ఇదిలావుంటే, నేడు అంత‌రి అర‌చేతుల్లోనూ ద‌ర్శనమిస్తున్న స్మార్ట్ ఫోన్లే వేదిక‌గా.. సోష‌ల్ మీడియాలోనూ రాజ‌ధానిపై తీవ్ర చ‌ర్చ సాగుతోంది. కొందరు ఇక్కడ కూడా జ‌గ‌న్ తీసుకోబోయే నిర్ణయాన్ని స‌మ‌ర్ధిస్తున్నారు. మ‌రికొంద‌రు త‌ప్పుప‌డుతున్నారు. జ‌గ‌న్ చెబుతున్న అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ రాజ‌ధానుల వికేంద్రీక‌ర‌ణ‌తో సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నవారు కూడా క‌నిపిస్తున్నారు. అయితే, దీనికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల‌ను చూపిస్తున్నవారు కొంద‌రు క‌నిపిస్తున్నారు.

మూడు ప్రాంతాల్లో ఉంటే….

ఉదాహ‌ర‌ణ‌కు ఏ మారు మూల ప్రాంతానికైనా.. సీఎం వ‌స్తున్నారు లేదా క‌లెక్టర్ ప‌ర్యట‌న‌కు వ‌స్తున్నారు అన‌గానే ఆటోమేటిక్‌గా అక్కడి రోడ్లు శుభ్రమై పోతాయి. డ్రెయిన్లు బాగైపోతాయి. అధికారులు ఠంచ‌నుగా ఆఫీస్ కు వ‌స్తారు. అదే స‌మ‌యంలో పారిశుధ్య కార్యక్రమాలు కూడా లైన్‌లో ప‌డ‌తాయి. ఇప్పుడు దీనినే ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నారు కొంద‌రు నెటిజ‌న్లు. రాజ‌ధానులు మూడు ఉంటే.. ఆ మూడు ప్రాంతాల్లోనూ అధికారుల హ‌డావుడి, మంత్రుల హ‌డావుడి ఉంటుంద‌ని, ఫ‌లితంగా ఆయా ప్రాంతాలు ఆటోమేటిక్‌గా డెవ‌ల‌ప్ అయిపోతాయ‌ని అంటున్నారు.

కత్తి మీద సాము లాంటిదేనని….

అదే టైంలో ఈ కాన్సెఫ్ట్ బెడిసికొడితే అనే ప్రశ్న కొంద‌రి నుంచి వినిపిస్తోంది. మూడు రాజ‌ధానులు ఉన్నా.. మూడు ప్రాంతాల‌ను అభివృద్ధి చేసి చూపించ‌డం జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాములాంటిదే. ఏదేమైనా మూడు ప్రాంతాల్లో అభివృద్ధికి జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణయం స‌రైంద‌నేన‌ని 60 శాతం పైగా ప్రజ‌ల నుంచి మ‌ద్దతు ల‌భిస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. మ‌రి జ‌గ‌న్ ఈ న‌మ్మకాన్ని ఎలా నిజం చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News