జగన్ కి జై కొడుతున్నారెందుకో?

విశాఖలో బీజేపీ రాజు గారు అంటే పాపులరే. ఆయన 2014 ఎన్నికల్లో అనూహ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆన అదృష్టమో మరేమో తెలియదు కానీ [more]

Update: 2019-11-23 11:00 GMT

విశాఖలో బీజేపీ రాజు గారు అంటే పాపులరే. ఆయన 2014 ఎన్నికల్లో అనూహ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలిచారు. ఆన అదృష్టమో మరేమో తెలియదు కానీ ఏకంగా ఆయన బీజేపీ శాసనసభా పక్ష నేత అయిపోయారు. దాంతో పాటు కార్మిక సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో రాజు గారు చాన్స్ దక్కిందే తరువాయి అన్నట్లుగా ఏపీ రాజకీయాల్లో దూసుకుపోయారు. అప్పట్లో అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్షంగా బాయ్ కాట్ చేయడంతో రాజు గారి పంట పండింది. చివరి రెండేళ్ళు అయితే ఆయనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా వ్యవహరించారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి బాబుకు చాలా దగ్గరయ్యారు. ఆయన ఆ చనువును ఆసరాగా చేసుకుని పార్టీ మారి టీడీపీ నుంచి పోటీ చేద్దామనుకున్నారు కూడా. అయితే టీడీపీలో లెక్కలు సరిపోకపోవడంతో ఆయన బీజేపీలోనే ఉండిపోయారు. ఓ దశలో వైసీపీ నుంచి పోటీకి ప్రయత్నించారు. అప్పటికే జగన్ అభ్యర్ధిని ఎంపిక చేయడం వల్ల రాజు గారికి ఎటూ కాకుండా పోయిందని అంటారు.

జగన్ పై బాణాలు…

ఇక రాజు గారు ఓడిపోయినా బీజేపీలో పెద్ద నాయకునిగా చలామణీ అవుతున్నారు. ఆయన జగన్ ని ప్రజా సమస్యలపై కలవాలని పలుమార్లు ప్రయత్నం చేసినా కూడా అప్పాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రతీసారి అసహనం వెళ్లగక్కేవారు. జగన్ మీద కొత్తల్లో గట్టిగా విమర్శలు చేసేవారు. ఆయన పాలన బాగులేదని కూడా ఘాటుగా కామెంట్స్ చేసేవారు. చంద్రబాబే నయం అంటూ కూడా జగన్ ని ప‌రోక్షంగా నిందించారు. బాబు అప్పాయింట్మెంట్ ముఖ్యమంత్రిగా ఎపుడు కావాలంటే అపుడు దొరికేదని కూడా ఆయన చెప్పి జగన్ ని దెప్పిపొడిచేవారు. జగన్ ప్రజా సమస్యలు పట్టించుకోలేదని కూడా ఎన్నో మార్లు పార్టీ వేదికల మీద మాట్లాడిన రాజు గారు ఇపుడు పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. దానికి కారణం ఇటీవల పార్టీలో మారుతున్న పరిస్థితులు, కొత్తగా వస్తున్న మార్పులుగా చెబుతున్నారు. ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే, తనని ఓడించి గెలిచిన గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరబోతున్నార‌న్న ప్రచారంతో రాజుగా కొంత ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. మాటవరకు మాత్రం ఆయన గంటా వచ్చినా పార్టీలో ఆహ్వానం పలుకుతామని చెబుతున్నారు. అయితే గంటా వస్తే తన సీటు గోవిందా అని తెలుసు కనుక మౌనంగానే ఉంటున్నారు.

జగన్ మంచి అయ్యారా…?

ఇంతకాలం జగన్ ని విమర్శించిన రాజు గారికి ఇపుడు మంచిగా కనిపిస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. అందరూ ఇంగ్లీష్ మీడియం బోధనను వ్యతిరేకిస్తూంటే పని గట్టుకుని మరీ రాజుగారు జగన్ ని పొగడడం ఇపుడు పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ఓ వైపు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్మీనారాయణ వంటి వారు అయితే జగన్ తెలుగు భాషను చంపేశారని అంటూంటే విష్ణు మాత్రం ఇంగ్లీష్ బోధన మంచిదే, కాలానికి తగినట్లుగా బోధనలో మార్పులు అవసరమేనని అనడం పట్ల సర్వత్రా విస్మయం కలుగుతోంది. ప్రతీ దానికి విమర్శలు చేసే రాజు గారు ఇపుడు పార్టీ కాదన్న అంశంపై యెస్ అని బల్ల గుద్ది మరీ జగన్ని పొగడడం అంటే ఆయన ఆలోచనలు ఏమైనా మారుతున్నాయా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట. ఎందుచేతంటే గంటా వంటి బిగ్ ఫిగర్ విశాఖలో బీజేపీలోకి వస్తే రాజు గారి లాంటి వారికి ఇరకాటమే. దాంతో ముందు చూపుతోనే ఆయన మరో వైపు జగన్ ని పొగుడుతున్నారని అంటున్నారు. ఇక గంటా విశాఖలో పెద్ద భూకబ్జాదారు అని ఆరోపణలు చేసిన రాజు గారు ఇపుడు ఒకే పార్టీలో కలసి ఉండగలరా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. మరొ చూడాలి బీజేపీ రాజు గారి రాజకీయం ఏంటో.

Tags:    

Similar News