బ్రేకింగ్ : ఏపీలో మూడుప్రాంతాల్లో మూడు రాజధానులు

రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు వస్తాయన్నారు. జ్యుడిషియల్ కేపిటల్, లెజిస్టేచర్ కేపిటల్, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ లు ఉంటాయని జగన్ [more]

Update: 2019-12-17 12:46 GMT

రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ క్లారిటీ ఇచ్చారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు వస్తాయన్నారు. జ్యుడిషియల్ కేపిటల్, లెజిస్టేచర్ కేపిటల్, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ లు ఉంటాయని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.రాజధాని అమరావతిలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేసింది ఐదు వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. రాజధాని అమరావతి పేరిట బాండ్లను తీసుకొచ్చారన్నారు. 10.3 శాతం వడ్డీతో బాండ్లు అమ్మారని, దీనికి వడ్డీ కింద 700 కోట్లు చెల్లించాల్సి వస్తుందన్నారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు తన బినామీల చేత ముందుగానే భూములు కొనుగోలు చేయించారన్నారు. 4070 ఎకరాల భూములను చంద్రబాబు బినామీలు కొనుగోలు చేశారన్నారు. బెదిరించి దళితులనుంచి భూములను లాక్కున్నారన్నారు. చంద్రబాబు తాను బాగుపడి ఖజానాను ఖాళీ చేశారన్నారు. ఈరోజు అమరావతిలో 54 ఎకరాలను అభివృద్ధి చేయాలంటే కోట్లాది రూపాయల అవసరమన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా అమరావతిని అభివృద్ధి చేయగలమా? అని ఆలోచించిన మాట వాస్తవమేనన్నారు.

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్…..

వికేంద్రీకరణ జరగాలన్నారు జగన్. సంక్షేమ పథకాలను అమలుపరుస్తూనే అభివృద్ధిని కూడా చేయాలన్నారు. జ్యుడిషియల్ కాపిటల్ ఒకవైపు, లెజిస్లేచర్ కేపిటల్, ఎగ్జిక్యూటివ్ కాపిటల్ ఏపీకి వచ్చే అవకాశముందన్నారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఖర్చే ఉండదన్నారు. విశాఖలో మెట్రో రైలు వేస్తే సరిపోతుందన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఉందన్నారు. రాజధానిపై కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక త్వరలోనే వస్తుందన్నారు. రాజధానిపై రెండు కమిటీలు వేశామని చెప్పారు. సుదీర్ఘంగా ఆలోచించి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News