ఫీజు రీయింబర్సుమెంట్ – తేడా వస్తే ఫీజుల్లేపేస్తారు ఇక

ఇదో విచిత్రమైన పరిస్థితి. చాలా పేద కుటుంబాలకు తెలిసిన విషయం. చాలా పేద కుటుంబాలు అనుభవించిన కష్టం. చాలా పెద్ద కుటుంబాలకు తెలియని విషయం. పెద్ద కుటుంబాలకు [more]

Update: 2020-09-06 18:29 GMT

ఇదో విచిత్రమైన పరిస్థితి. చాలా పేద కుటుంబాలకు తెలిసిన విషయం. చాలా పేద కుటుంబాలు అనుభవించిన కష్టం. చాలా పెద్ద కుటుంబాలకు తెలియని విషయం. పెద్ద కుటుంబాలకు జరగని నష్టం. పేద కుటుంబాల నుండి వచ్చిన యువతకు కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశం లేదు. 1990 దశకంలో విస్తృతంగా వచ్చిన ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలల్లో ఆ ఇంజనీరింగ్, మెడికల్ విద్య అందని ద్రాక్షగానే మిగిలింది.

వైఎస్ ప్రవేశ పెట్టడంతో….

ఇంటర్ తర్వాత పేద కుటుంబాల పిల్లలు సాంప్రదాయ కోర్సులకు పరిమితమైన రోజుల్లో డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్ పధకం ప్రవేశపెట్టారు. ఈ పథకంతో రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ మరియు మెడికల్ కళాశాలలు పేదల పిల్లలకు మొదటిసారిగా ద్వారాలు తెరిచాయి. పెద్ద సంఖ్యలో పేదల పిల్లలు ఇంజనీరింగ్, మెడికల్ విద్య మొదలుపెట్టారు. సమస్య ఇక్కడే మొదలయింది. విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చిన కొన్ని కార్పొరేట్ కళాశాలలు ‘ఫీజు రీయింబర్సుమెంట్’ దరఖాస్తులన్నీ పూర్తయ్యాక, లేదా ప్రభుత్వం నుండి నేరుగా ‘ఫీజు రీయింబర్సుమెంట్’ సొమ్ము తమ ఖాతాలో పడిన తర్వాత అసలు సమస్య మొదలయ్యేది.
తోటి విద్యార్థుల్లో, ఉపాధ్యాయులో లేక కళాశాల యజమాన్యమో ఈ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులు మొదలు పెట్టేవి. సహవిద్యార్థులైతే ర్యాగింగ్, ఉపాధ్యాయులయితే తరగతిగదిలో శిక్షలు, యాజమాన్యం అయితే ఏదో ఒక సాకుతో అదనపు ఫీజు డిమాండ్ చేయడం, పనిష్మెంట్ విధించడం… ఇవన్నీ జరుగుతూ ఉండేవి.

అన్నింటా ఇబ్బందులే….

ఈ గోల భరించలేని ఆ విద్యార్థులు, వారి కుటుంబాలు పడే వేదన అంతా ఇంతా కాదు. చదువుపై ఇష్టంతో ఈ కష్టాలన్నీ భరించే వారు. ఇంకొందరు కాలేజీ మానేసేవారు. ఇంకో కాలేజీలో చేరాలంటే సదరు విద్యార్థి సర్టిఫికెట్లు ఇచ్చేవారు కాదు. ఇది అన్ని చోట్లా జరిగిందని కాదు. చాలా చోట్ల జరిగింది. తల్లిదండ్రులే కష్టపడి యాజమాన్యాలు అడిగే అదనపు సొమ్ము కట్టేవారు. సహవిద్యార్థుల ర్యాగింగ్, ఉపాధ్యాయుల వేధింపులు ఆ విద్యార్థులే నిస్సహాయంగా అనుభవించేవారు. ప్రభుత్వం ‘ఫీజు రీయింబర్సుమెంట్’ ఇచ్చేసింది కాబట్టి యాజమాన్యాలకు కలిగే నష్టం ఏమీలేదు. వాళ్ళకలా కలిసొచ్చేది.

కట్టడి చేయగలమని….

గ్రామాల్లో ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ చేసిన పేద కుటుంబాల పిల్లలను, ప్రత్యేకించి ఎస్సి, ఎస్టీ లను ఎవరిని అడిగినా తమ స్వానుభవమో, సహచరుల స్వానుభవమో చెప్తారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ ఫీజు వాపసు ఇవ్వాల్సిందే అనే నిర్ణయం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు చేసే విద్యా వ్యాపారాన్ని కొంతమేర కట్టడి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వం ‘ఫీజు రీయింబర్సుమెంట్’ నగదు నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి జమచేయాలని తీసుకున్న నిర్ణయం కూడా పేద విద్యార్థులకు, ప్రత్యేకించి ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అన్నిరకాల వేధింపులనుండి విముక్తి కలిగిస్తుంది.

 

-గోపీ దారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News