జగన్ ను కౌగిలించుకుంటుంది అందుకేనట

ఈ మాట కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ శైలజానాధ్ చెబుతూ జగన్ ని మైనారిటీలకు దూరం చేయలనుకుంటారు. ఇక ఏపీలోని వామపక్షాలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ [more]

Update: 2020-06-28 02:00 GMT

ఈ మాట కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ శైలజానాధ్ చెబుతూ జగన్ ని మైనారిటీలకు దూరం చేయలనుకుంటారు. ఇక ఏపీలోని వామపక్షాలు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ని, మోడీ దయ కోసం నానా తంటాలు పడుతున్న చంద్రబాబును ఒక్కమాట కూడా అనవు. కానీ జగన్ బీజేపీతో లాలూచీ పెట్టుకున్నారని అంటారు. సరే ఎవరు ఎలా అనుకున్నా జగన్ కి బీజేపీకి మధ్యన ఉన్నది ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది. దానికి సమాధానం రాజకీయ బంధమేనని చెప్పాలి. బీజేపీకి జగన్ అవసరం ఉంది. అలాగే జగన్ కి కూడా బీజేపీ అవసరం ఉంది. ఇలా ఉభయకుశలోపరిగా ఈ బంధం సాగుతోంది. అయితే అది జాతీయ స్థాయి వరకే పరిమితం. రాష్ట్రంలో మాత్రం బీజేపీ జగన్ ని టార్గెట్ చేస్తుంది.

ఎందుకంటే….?

జగన్ తో బీజేపీ చెలిమికి ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. జగన్ స్ట్రయిట్ పాలిటిక్స్ చేస్తారు. అది బీజేపీకి నచ్చుతుంది. అంతే కాదు, యువకుడు, పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్న యువ నాయకుడు. ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. అద్భుతాలు ఏవైనా జరిగితే తప్ప 2024లో మరోసారి జగన్ రావడం ఖాయమని బీజేపీ కేంద్ర పెద్దలు కూడా నమ్ముతున్నారట. అదే జగన్ తో బీజేపీ బంధాన్ని మరింతగా పెంచుతోంది అంటున్నారు. జగన్ అండ ఉంటే కేంద్రంలో మళ్లీ పాగా వేయడానికి అవకాశం ఉంటుందని ఇప్పటినుంచే కాషాయ నాయకత్వం లెక్కలు వేసుకుంటోంది.

అలా జరిగితే …?

ఇక 2024 నాటికి బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ రాదు అన్న సంకేతాలు ఉన్నాయి. ఎంత చెడ్డా కాంగ్రెస్ మరో నాలుగేళ్ళలో పుంజుకుని వంద సీట్ల మార్క్ దాటుతుంది అంటున్నారు. అలాగే దేశంలో చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలకు కొత్త బలం వస్తుందని అంటున్నారు. అపుడు మూడవసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారం సంపాదించాలంటే జగన్ ఆధారం. ఇక ఏపీలో చూసుకుంటే 2024 నాటికి జగన్ కి మరీ 22 ఎంపీ సీట్లు రాకపోయినా 15 ఎంపీ సీట్లకు తగ్గవని అంటున్నారు. ఆ బలం బీజేపీకి తోడు అయితే ముచ్చటగా మూడవసరి మోడీ ప్రధాని అవుతారు. అందుకే జగన్ తో బీజేపీ కేంద్ర పెద్దలు మంచిగా ఉంటున్నారని అంటున్నారు.

బాబుకు డోర్స్ క్లోజ్….

ఇక బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ చంద్రబాబుని నమ్మడంలేదని కూడా ఢిల్లీ వార్తలు చెబుతున్నాయి. బాబు ఎపుడెలా ఉంటారో ఆయనకే తెలియదు. రాజకీయ లాభమే బాబు చూస్తారని బీజేపీ పెద్దల గట్టి నమ్మిక. 2019 ఎన్నికల్లోనే కాంగ్రెస్ కూటమిలో చేరిన బాబు ఇపుడు ఫ్లేట్ ఫిరాయించినా 2024 నాటికి మళ్లీ బలం సంపాదిస్తే కచ్చితంగా మోడీ టీం కి దెబ్బేస్తారన్న డౌట్లు బీజేపీ నేతలకు ఉందిట. ఇక జగన్ అయితే కచ్చితంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు మద్దతు ఇవ్వరని బీజేపీ నేతలే చెబుతున్నారు. ఈ కాంగ్రెస్ వ్యతిరేకతే జగన్ ని, బీజేపీని కలుపుతోందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఇక జగన్ తో ఎన్నో అవసరాలు బీజేపీకి ఉన్నాయి. రాజ్యసభలో అంతకంతకు పెరుగుతున్న వైసీపీ బలం కూడా జగన్ ని దూరం చేసుకోనీయడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే ఏపీలో బాబుని పట్టించుకోకూడదని బీజేపీ డిసైడ్ అయిందని అంటున్నారు. ఇక బీజేపీలో ఉన్న బాబు ఎంపీల‌ టీం విషయంలో కూడా కాషాయ‌ పెద్దలు అంటీముట్టనట్లుగానే ఉంటున్నారుట. ఇంత రచ్చ చేస్తున్న సుజనా చౌదరి 2022లో మాజీ ఎంపీ అయిపోతారు. అందువల్ల ఆయన్ని అలా వదిలెస్తేనే బెటర్ అని కాషాయం నేతలు అంటున్నారుట. మొత్తం మీద బాబు కుప్పిగెంతులు అన్నీ కూడా ఏపీకే పరిమితమని అంటున్నారు.

Tags:    

Similar News