చాలా టైం ఉంది బాసూ

“వైఎస్ జగన్ కు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పుడు కేవలం రెండున్నర నెలల పాలన మాత్రమే చూశాం. ముందు ముందు జగన్ ఎలా దూసుకెళ్తారో చూడండి” [more]

Update: 2019-08-24 05:00 GMT

“వైఎస్ జగన్ కు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది. ఇప్పుడు కేవలం రెండున్నర నెలల పాలన మాత్రమే చూశాం. ముందు ముందు జగన్ ఎలా దూసుకెళ్తారో చూడండి” ఇదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు. నిజమే. ఇప్పటికి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయి కేవలం రెండున్నర నెలలు మాత్రమే అయింది. వైఎస్ జగన్ ఇంకా పాలనపై దృష్టి పెట్టలేదు. కేవలం శాఖలపై అవగాహన మాత్రమే పెంచుకుంటున్నారు. ఈ రెండున్నర లోపే జగన్ నిర్ణయాలన్నీ తప్పు అని, రాష్ట్రానికి పట్టిన శని అంటూ చంద్రబాబు నాయుడు జనంలోకి వెళుతున్నారు.

రెండు నెలలూ….

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత రెండు నెలల పాటు వివిధ శాఖలపై సమీక్షలు చేశారు. తాను మ్యానిఫేస్టోలో పెట్టినవీ, పాదయాత్రలో చెప్పినవీ తొలి ఏడాదే అమలు పర్చాలన్న నిర్ణయంతో వాటిని గ్రౌండ్ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, వైఎస్ రైతు భరోసా వంటి ముఖ్యమైన కార్యక్రమాలను త్వరలోనే ప్రజలకు అందించాలన్న నిర్ణయంతో ఉన్నారు.

టీడీపీ అవినీతిపై….

వీటితో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపాలన్నదే వైఎస్ జగన్ ప్రధాన ఉద్దేశ్యం. పోలవరం, అమరావతి నిర్మాణాల్లో అవినీతి జరిగిందని ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని నిరూపించలేక పోతే ప్రజల్లో చులకన అవుతామని భావించి వాటిపై కమిటీలు వేశారు. ఇంకా వివిధ పనుల్లో జరిగిన అవినీతిపై నియమించిన కమిటీల నివేదికలను అందాల్సి ఉంది.

ఆ రెండింటినే పట్టుకుని….

ఇక రాజధాని అమరావతిపై కూడా రచ్చ అవుతుంది. చంద్రబాబు గత ఎన్నికల్లో పోలవరం, అమరావతి తనకు వరంగా మారతాయని భావించారు. కానీ వాటి వల్లనే ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు ఆ రెండింటినే పట్టుకుని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. అమరాతి నుంచి రాజధానిని మారుస్తామని వైఎస్ జగన్ ఎక్కడా చెప్పలేదంటున్నారు మంత్రులు. కానీ అమరావతిని మార్చేస్తారంటూ చంద్రబాబు జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఎన్నికల ప్రచారంలో కూడా జగన్ వస్తే అమరావతిని మారుస్తారంటూ చంద్రబాబు ప్రచారం చేశారు. అయినా ఫలితం లేదు. మరి ఈసారి చంద్రన్న మాటలను జనం నమ్ముతారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News