ఎవరి ట్రాప్ లో ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే నడుస్తున్నారన్నది ఇప్పటి వరకూ విన్పిస్తున్న విమర్శ. ఇక విపక్ష తెలుగుదేశం పార్టీ అయితే [more]

Update: 2019-10-21 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్ లోనే నడుస్తున్నారన్నది ఇప్పటి వరకూ విన్పిస్తున్న విమర్శ. ఇక విపక్ష తెలుగుదేశం పార్టీ అయితే కేసీఆర్ చెప్పినట్లు జగన్ నడచుకుంటున్నారని పదే పదే చెబుతుంది. గోదావరి జలాల మళ్లింపు విషయంలో కేసీఆర్ ట్రాప్ లో జగన్ పడిపోయారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కేసీఆర్ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి కూడా జగన్ సిద్ధమయ్యారని కూడా అన్నారు.

అనేక ఆరోపణలు….

ఎన్నికల సమయంలో జగన్ కు కేసీఆర్ పెద్దయెత్తు ఆర్థిక సాయం చేయడంతోనే జగన్ కేసీఆర్ చెప్పినట్లు వింటున్నారని, అందుకే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకుండా, హుజూర్ నగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చారన్న ఆరోపణలు కూడా విపక్ష పార్టీల నుంచి విన్పిస్తున్నాయి. అయితే లోతుగా పరిశీలిస్తే జగన్ తాను అనుకున్నదే చేస్తున్నారు కాని కేసీఆర్ చెప్పినట్లు నడుచుకోవడం లేదని స్పష్టమవుతోంది.

కేసీఆర్ కాదన్న వారిని….

ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని జగన్ ప్రకటించడం టీఆర్ఎస్ కు తెలంగాణలో ఇబ్బందిగా మారింది. అయితే ఇది జగన్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ కావడంతో ఎవరూ కాదనలేరు. ఇక తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన రాజీనామా చేస్తు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ అధికారులపై వివక్ష కొనసాగుతుందని బహిరంగంగానే ఆరోపణలు చేశారు.

జగన్ నిర్ణయాలు…..

అదే ఐఏఎస్ అధికారి మురళిని జగన్ తన ప్రభుత్వ సలహాదారుగా నియమించుకున్నారు. అలాగే తెలంగాణకు చెందిన అనేక మందిని సలహాదారులుగా కూడా నియమించుకున్నారు. ఇక ఆరోగ్య శ్రీ విషయంలో కూడా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కేసీఆర్ కు ఇబ్బందిపెట్టే విధంగానే ఉంది. దాదాపు 1200 వ్యాధులను జగన్ ఆరోగ్యశ్రీలో చేర్చారు. జగన్ తీసుకుంటున్న ఒక్కొక్క నిర్ణయం పొరుగు రాష్ట్రం తెలంగాణను ఇబ్బందిపెట్టే విధంగానే ఉంది. మరి కేసీఆర్ జగన్ ట్రాప్ లో పడ్డారా? లేదా? అన్నది జరుగుతున్న సంఘటనలు చూసి బేరీజు వేయాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News