జగమంతా జగన్ సన్నివేశమేనా? వార్ వన్ సైడేనా?

ఏపీ విపక్ష శిబిరంలో రాజకీయ శూన్యత ఉందా. ఈ ప్రశ్న కనుక ఎవరైనా వేస్తే అదేమిటి అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారు కదా అంటారు. నిజమే ఎటువంటి [more]

Update: 2020-03-18 11:00 GMT

ఏపీ విపక్ష శిబిరంలో రాజకీయ శూన్యత ఉందా. ఈ ప్రశ్న కనుక ఎవరైనా వేస్తే అదేమిటి అపర చాణక్యుడు చంద్రబాబు ఉన్నారు కదా అంటారు. నిజమే ఎటువంటి వారికైనా కాలం అనేది ఒకటి ఉంటుంది. చంద్రబాబు ఒకప్పుడు సూపర్ స్టార్. ఇపుడు మాత్రం ఆయన కత్తి పదును తగ్గిపోయింది. మరో వైపు అదే రాయలసీమ నుంచి వైఎస్సార్ వారసుడిగా జగన్ ఉద్భవించారు. ఆయన వయసు తక్కువ. మరో మూడు దశాబ్దాలు రాజకీయం చేసే నేర్పూ, ఓర్పూ అన్నీ ఉన్న నేతగా జగన్ ఏపీ రాజకీయాల్లో బాగానే కుదురుకున్నారు. మరి ఆయన్ని తట్టుకుని నిలిచే నేత ప్రతిపక్ష సమూహంలో ఇపుడు ఒక్కరైనా ఉన్నారా అన్నదే డౌట్.

బాబునే ఓడిస్తే….?

చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈసారి లోకల్ బాడీ ఎన్నికల్లో కనుక ఆయన ఓడిపోతే అది స్వయంకృతమే అవుతుంది. పార్టీకి సరైన దశ, దిశ చూపించలేని బాధ్యత ఆయనదే అవుతుంది. మళ్ళీ మళ్ళీ జగన్ ని తక్కువగా అంచనా వేసిన నేతగా కూడా చంద్రబాబు ఉంటారు. చంద్రబాబు గత కాలం వైభవాల్లోనే ఉంటూ వర్తమానాన్ని మరచిన నేతగా కూడా ఉంటారు. ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల కోసమే చంద్రబాబు గత తొమ్మిది నెలల్లో ఎన్నో చేశారు. అవన్నీ తుత్తునియలు చేసి జగన్ మొత్తం జయిస్తే మాత్రం టీడీపీ కోట కుప్ప కూలాల్సిందే.

ఏది ప్రత్యామ్నాయం?

ఏపీలో ఎంత చెప్పుకున్నా టీడీపీ తప్ప మరో గట్టి పార్టీ విపక్షంలో లేనే లేదు. అటువంటి టీడీపీని లోకల్ బాడీ ఎన్నికలతో ఓ మూలన పెడితే ఇక ఎదురేముంటుంది. చంద్రబాబు స్థాయి కాదు కదా ఆయన తరువాత కొంతైనా రాజకీయం చేసి జగన్ ని ఎదిరించే నేత విపక్ష కూటమిలో ఉన్నారా అంటే లేరని గట్టిగానే చెప్పాలి. జనసేన బీజేపీ కూటమి చెప్పుకోవడానికే మల్టీ స్టారర్ మూవీలా ఉంటుంది. అక్కడ రెండు పార్టీలకూ బలాల కంటే బలహీనతలే ఎక్కువగా ఉన్నాయి. నామినేషన్ల ఘట్టంలోనే అది తేటతెల్లమైంది.

ఎదురులేదా..?

మొత్తం మీద చూసుకున్నపుడు జగన్ పక్కా ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారనిపిస్తుంది. జగన్ కత్తికి ఎదురు ఉండరాదు. ఆయనకు అతి పెద్ద అడ్డంకి చంద్రబాబు. లోకల్ బాడీ ఎన్నికల్లో పసుపు పార్టీని కకావికలు చేస్తే ఇక బలమైన నాయకుడు, ఎదిరించే మొనగాడు లేకుండా నాలుగేళ్ళ పదవీకాలం జగన్ ఎంచక్కా ఏలుకోవచ్చు. తెలంగాణాలో కేసీఆర్ మాదిరిగా విపక్ష అన్నది లేకుండా కట్టడి చేయవచ్చు. ఆ తరువాత 2024 నాటికి ఆ పునాదిని మరింత గట్టి చేసుకుని మళ్ళీ మళ్ళీ గెలవవచ్చు. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఇప్పటికిపుడు చూసినపుడు వార్ వన్ సైడ్ అన్నట్లుగానే ఉంది. టీడీపీ మరీ ఇంతలా చతికిలపడిపోయాక జగమంతా జగనే అన్న సన్నివేశమే కనిపిస్తుంది. ఓ విధంగా ఏపీ రాజకీయాల్లో సరికొత్త అంకం లోకల్ బాడీ ఎన్నికల తరువాత మొదలవుతుంది. వైసీపీ కేంద్రంగా రాజకీయం మొత్తం కేంద్రీక్రుతమయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది.

Tags:    

Similar News