జగన్ పవన్ ను నేరుగా టార్గెట్ చేసేస్తున్నారా ?

మొత్తానికి జగన్ తెగించేసినట్లే కనిపిస్తున్నారు. ఆయన అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. దీని వెనక రెండు కారణాలు ఉన్నాయని అనుకోవాలి. ఒకటి తనకు కాపు సామాజికవర్గం ఓట్లు పూర్తిగా [more]

Update: 2021-04-10 06:30 GMT

మొత్తానికి జగన్ తెగించేసినట్లే కనిపిస్తున్నారు. ఆయన అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు. దీని వెనక రెండు కారణాలు ఉన్నాయని అనుకోవాలి. ఒకటి తనకు కాపు సామాజికవర్గం ఓట్లు పూర్తిగా పడవు అన్న కచ్చితమైన అభిప్రాయం అయినా అయి ఉండాలి. లేకపోతే పవన్ ని ఆయన సొంత సామాజికవర్గం ఒక రాజకీయ నాయకుడిగా పూర్తిగా గుర్తించడంలేదు అన్న నిబ్బరం అయినా ఉండాలి. మొత్తానికి జగన్ ఒక వైపుకే వచ్చేశారు. పవన్ తో ఢీ కొట్టాల్సిందే అని కూడా అనుకుంటున్నారు.

డేరింగేనా…?

మామూలుగా పెద్ద హీరోల సినిమాలకు అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతోపాటు ఎంత టికెట్ పెంచుకున్నా పెద్దగా అభ్యంతరాలు ప్రభుత్వాలు పెట్టవు. ఆ విష‌యంలో చూస్తే గతంలో ఏపీ సర్కార్ కూడా మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలను అలా చూసీ చూడనట్లుగా వదిలేసింది. కానీ ఇపుడు మాత్రం ఎందుకూ పవన్ సినిమా వకీల్ సాబ్ విషయంలో మాత్రం జగన్ సర్కార్ అడ్డం తిరిగింది. ఎక్కువ రేట్లతో టికెట్లు అమ్మ వద్దు అని ఖండితంగా చెప్పేసింది. దాంతో పాటు బెనిఫిట్ షోలకు నో చెప్పేసింది. పొరుగున ఉన్న తెలంగాణా రాష్ట్రం పచ్చజెండా ఊపితే జగన్ మాత్రం ఎర్ర జెండా చూపించారు. ఇది ఒక విధంగా డేరింగ్ తో తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు.

ఏం జరుగుతుంది …?

పవన్ ని సినిమా నటుడిగా అభిమానించిన వారు కూడా వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నారు. అంతెందుకు వైసీపీలో ఉన్న వారిలో చాలా మంది సినిమాల వరకూ పవన్ వైపే అని చెబుతారు. ఇక ఓట్లు కూడా గత ఎన్నికల్లో వైసీపీకి వేసి జనసేనని రాజకీయంగా ఓడించిన వారు కూడా పవన్ ఫ్యాన్సే. ఇపుడు వారిలో ఈ పరిణామం మీద కనుక చర్చ జరిగితే కచ్చితంగా అది వైసీపీకి నెగిటివ్ అవుతుంది అంటున్నారు. పవన్ మాకు సినిమాల్లో హీరో. జగన్ ను రాజకీయంగా అభిమానిస్తామని చెప్పుకునే వారు కూడా పవన్ సినిమాకు ఇబ్బంది జరిగితే కచ్చితంగా వైసీపీ మీదనే బాణాలు వేయడం ఖాయం. అది వైసీపీకి రాజకీయంగా నష్టమే అంటున్నారు.

కన్సాలిడేట్ అవుతారా…?

ఇక పవన్ విషయానికి వస్తే ఆయన తాను కాపుల నాయకుడిని అని ఎక్కడా చెప్పకపోయినా కూడా కొంతమంది ఆయన్ని సొంతం చేసుకున్నారు. అది పూర్తి స్థాయిలో జరగకనే 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. మరి జగన్ పవన్ సినిమాను కెలికి ఫ్యాన్స్ ని రెచ్చగొడితే కచ్చితంగా వారంతా ఒక్కటి అవుతారు అపుడు రాజకీయంగా కూడా పవన్ స్ట్రాంగ్ అవుతారు. మరి ఈ పరిణామాలను కూడా జగన్ ఊహించి మరీ ఇలా చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. అదే జరిగితే పవన్ కి కాపుల ఓట్లు పడి టీడీపీకి అలా నష్టం జరిగితే తనకు రాజకీయంగా లాభం అని జగన్ కొత్త లెక్కలేవైనా వేసుకున్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది. మొత్తానికి పవన్ ని ఎదుర్కోవాలి అన్న డెసిషన్ మాత్రం జగన్ గట్టిగానే తీసుకున్నారు. అది ఎంతవరకూ వెళ్తుందో తెలిస్తేనే ఏపీ పొలిటికల్ స్టోరీలో కొత్త ట్విస్టులు ఏముంటాయో తెలిసేది.

Tags:    

Similar News