లొసుగులను పట్టేసి..అనేసి..?

ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎవరు ప్రస్తావించిన అవతల వారు మొత్తం కదిలిపోతారు. [more]

Update: 2019-11-13 12:30 GMT

ప్రతి మనిషిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ఎవరు ప్రస్తావించిన అవతల వారు మొత్తం కదిలిపోతారు. ఒక విధంగా గట్టిగా కెలికినట్లుగా ఉంటుంది. కానీ రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి కెలుకుళ్ళే కావాలక్కడ. మహా కవి శ్రీ శ్రీ చెప్పినట్లుగా ప్రజా జీవితంలోకి వస్తే మొత్తం అడిగేస్తారు, కడిగేస్తారు. ఏపీ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా సిధ్ధాంతాలు పక్కకు పోయాయి. రాధ్ధాంతాలు, వ్యక్తిగత విమర్శలే ముందుకు వచ్చేశాయి. ఇపుడు ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల అధినేతల విషయంలో డైరెక్ట్ గా గుచ్చుకునే ఆరోపణలు చేయాలంటే వారి గతంలోకి వెళ్తే చాలు. ఆ మరకలను చెరిపోకుండా మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ చెడుగుడు ఆడేసుకోవడమే. ముఖ్యమంత్రి జగన్ విషయమే తీసుకుంటే ఆయన మీద లక్ష కోట్లు తిన్నారన్న అవినీతి ముద్ర వేశేశారు. ఆయన కేసు న్యాయస్థానంలో ఉంది. అయినా విమర్శలు చేఏటపుడు ప్రతీసారి దాన్ని వాడుకోవడం ద్వారా జగన్ ని కార్నర్ చేస్తూ వస్తున్నారు రాజకీయ ప్రత్యర్దులు.

వెనక బురద మరి…

ఇక ఇలా ఆరోపణలు చేసే వారి వెనక కూడా పెద్ద బురద ఉంటోంది. దాన్ని కెలికి వారి ఆయువుపట్టు కొట్టేందుకు వైసీపీ కూడా ఎపుడూ ప్రయత్నం చేస్తూంటూంది. చంద్రబాబు విషయానికి వస్తే ఆయనకు వెన్నుపోటు రాజకీయం బిరుదు తగిలించేశారు. అప్పట్లో జరిగినది చంద్రాబాబు వాదనలో ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే, దాన్ని ఎన్టీయార్ అభిమానులు ఇప్పటికీ వెన్నుపోటు అంటారు. అదే జగన్ తదితరులు కూడా రాజకీయ ఆయుధంగా వాడుకుంటారు. ఇక మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన మీద కూడా వ్యక్తిగతమైనా కొన్ని మరకలు ఉన్నాయి. ఆయన మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం, విడాకులు..ఇలా ఆ గొడవను విమర్శించేటపుడు కావాలనే ఎదుటి పక్షాలు తీసుకువస్తాయి. దీంతో విలవిల్లాడిపోవడం తప్ప ఏం చేయలేని పరిస్థ్తి. ఇలా ముగ్గురు నేతల విషయంలోనూ తరచూ ఇదే జరుగుతోంది.

రిటార్ట్ ఇచ్చారా….?

పవన్ విషయంలో మామూలుగా జగన్ పెద్దగా పట్టించుకోరు, ఏమైనా అనాల్సివస్తే తన పార్టీ నేతల ద్వారా అనిపిస్తారని అంటారు. అయితే ఏడాది క్రితం పాదయాత్ర సందర్భంగా పవన్ మీద జగన్ హాట్ కామెంట్స్ చేశారు. కార్లు మార్చేసినట్లు పెళ్ళాలను మారుస్తారని జగన్ అంటే దానికి పవన్ ఫ్యాన్స్ పెద్ద రాధ్ధాంతమే చేశారు. ఇక ఇపుడు ముఖ్యమంత్రి అయ్యాక ఆరు నెలలుగా సైలెంట్ గా ఉన్న జగన్ పవన్ మీద తాజాగా ఘాటుగానే రెస్పాండ్ అయ్యారు. ముగ్గురు పెళ్ళాలు, అయిదుగురు పిల్లలూ అంటూ జగన్ చేసిన కామెంట్ పవన్ని గట్టిగా గుచ్చుకునేవే.

లాంగ్ మార్చ్ లో…..

లాంగ్ మార్చ్ సందర్భంగా కానీ, అంతకు ముందు మీడియా సమావేశాల్లో కానీ పవన్ జగన్ ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. జగన్ కోర్టు మెట్లు ఎక్కుతారని, లక్ష కోట్లు అవినీతి అంటూ పవన్ వాడిన మాటలు, విసుర్లకు ఇపుడు జగన్ గురి చూసి మరీ రిటార్ట్ ఇచ్చారని అంటున్నారు. రాజకీయాల్లో విధానాల మీట చర్చ జరగకపోతే ఇలాగే ఉంటుంది. ఒకటి అనడం నాలుగు తినడం, జనం ముందు నాయకులు అందరూ పలుచన కావడం. ఇదే ధోరణి ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. ఇకనైనా వ్యక్తిగత విమర్శలకు ఎవరూ పోకుండా ఉంటేనె ఈ తరహా కామెంట్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అంటున్నారు.

Tags:    

Similar News