తవ్విందేంది? తీసిందేంది?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఐదు నెలలు పూర్తి కావచ్చింది. అధికారంలోకి రాగానే తాను అవినీతి రహిత పాలన అందిస్తానని జగన్ చెప్పారు. ఇంతవరకూ [more]

Update: 2019-10-20 14:30 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ఐదు నెలలు పూర్తి కావచ్చింది. అధికారంలోకి రాగానే తాను అవినీతి రహిత పాలన అందిస్తానని జగన్ చెప్పారు. ఇంతవరకూ ఓకే. దీంతో పాటు గత ప్రభుత్వం చేసిన అవినీతిని తవ్వి వెలికి తీస్తానన్నారు. ఎన్నికలకు ముందు అనేక అంశాలపై జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం రాగానే వాటిని వెలికి తీస్తారని భావించారు. కానీ ఐదు నెలలు గడుస్తున్నా చంద్రబాబు పాలనలో జరిగిన ఒక్క అవినీతిని కూడా ఇంతవరకూ బయటపెట్టలేదు. ఇది టీడీపీకి అస్త్రంగా మారనుంది.

ఐదు నెలలు గడుస్తున్నా….

వైఎస్ జగన్ పాలన ఐదు నెలలు పూర్తికావస్తుంది. పోలవరంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందని జగన్ ఎన్నికలకు ముందు ఆరోపించారు. అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇంతవరకూ పోలవరంలో జరిగిన అవినీతి ఏంటో బయటపెట్టలేదు. దీనిపై నిపుణుల కమిటీని కూడా నియమించారు. ఇక పట్టిసీమలో కూడా వందల కోట్ల అవినీతి జరిగిందని జగన్ చెప్పారు. కానీ పట్టిసీమలో ఇంతవరకూ జగన్ పట్టింది లేదు. ఈ రెండు ఆరోపణలు కేవలం ఆరోపణలుగా మిగిలిపోయాయని టీడీపీ ఇప్పటికే ఎదురుదాడికి దిగింది.

అమరావతిలోనూ…..

రాజధాని అమరావతి విషయంలోనూ పెద్దయెత్తున ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనులు నిలిపేశారు. దీనిపై కూడా నిపుణుల కమిటీ వేశారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ పెద్దలకు వారి బినామీలకు భూములున్నాయని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరోపించారు. సీఐడీ సిబ్బంది నిర్విరామంగా కొద్ది నెలలుగా రాజధాని ప్రాంత గ్రామాల్లో దీనిపై విచారణ చేస్తున్నారు. కానీ ఇంతవరకూ భూములు కొన్న పసుపు పార్టీ పెద్దలెవరో స్పష్టం చేయలేకపోయారు.

విశాఖ భూ కుంభకోణంలోనూ….

తాజాగా వైఎస్ జగన్ విశాఖపట్నంలో భూ కుంభంకోణంపై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం నుఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో పెద్దయెత్తున భూ కుంభకోణం జరిగిందని అప్పట్లో జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సయితం ఆరోపించారు. సిట్ ను కొత్తగాఏర్పాటుచేసిన జగన్ దానికి మూడు నెలల సమయం ఇచ్చారు. ఇలా ప్రతి ఆరోపణలపై విచారణ అయితే చేస్తున్నారుకాని ఇంతవరకూ టీడీపీ చేసిన అవినీతిని బయటపెట్టలేదు. దీంతోనే తెలుగుదేశం పార్టీ టోన్ పెరిగిందంటున్నారు. మొత్తం మీద జగన్ కేవలం విచారణకు ఆదేశించి విపక్షాలను భయపెట్టడానికే అన్న సంకేతం ప్రజల్లోకి వెళుతుంది.

Tags:    

Similar News