బాబు బాటలో జగన్ …?

సోమవారం అంటే పోలవరం ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు స్లోగన్. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దీనికోసం అహరహం కృషి చేస్తున్నా అని చెప్పేందుకు చంద్రబాబు [more]

Update: 2020-12-14 05:00 GMT

సోమవారం అంటే పోలవరం ఇది గత ప్రభుత్వంలో చంద్రబాబు స్లోగన్. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్. దీనికోసం అహరహం కృషి చేస్తున్నా అని చెప్పేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ప్రచారం కూడా ఏ మాత్రం తక్కువ చేయలేదు. ముఖ్యంగా ప్రాజెక్ట్ వర్క్ కన్నా చంద్రబాబు చేసిన ప్రచార హడావిడి అంతా ఇంతా కాదు. 2017 నుంచి 2019 వరకు అదిగో నీరు ఇదిగో గ్రావిటీ పై నీరు అంటూ ఆయన తన అనుకూల ప్రచార మాధ్యమాల్లో హోరెత్తించేవారు. గత ఎన్నికల్లో అమరావతి, పోలవరం అంశాలతో ప్రజల్లోకి వెళ్లి తాను తిరిగి అధికారంలోకి వస్తేనే ఈ రెండు పూర్తి అవుతాయనే సంకేతాలు ఇచ్చినా జనం ఆయన్ను పక్కన పెట్టేశారు. ఐదేళ్లల్లో ఆయన ఈ రెండిటిని పూర్తి చేయలేకపోగా ప్రచారం మాత్రమే చేసుకోవడానికి వాటిని ఉపయోగించారని గుర్తించే ప్రజలు పక్కన పెట్టేశారు టిడిపి ని.

జగన్ సీరియస్ గా రంగంలోకి …

చంద్రబాబు తరహాలో కాకపోయినా వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ జగన్ సైతం పోలవరం పై సీరియస్ గానే ఫోకస్ పెట్టారు. తన తండ్రి ప్రారంభించిన ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ఆయన తన ముద్ర ఉండాలన్న తపనలో ఉన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఇది పూర్తి చేసి చరిత్ర కెక్కాలన్నది జగన్ తాపత్రయం. అయితే దీనికి కేంద్రంలోని బిజెపి వేస్తున్న కొర్రీలు పోలవరం పై జగన్ సర్కార్ వి గాలిమాటలుగా మిగులుతాయా అనే అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. దాంతో చంద్రబాబు తరహాలోనే ఈ ప్రాజెక్ట్ పై తన సీరియస్ నెస్ ను ప్రజలకు చూపాలిసిన అవసరం ముఖ్యమంత్రి జగన్ కి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన తరచూ పోలవరం ప్రాజెక్ట్ సందర్శన జరపాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా జగన్ కూడా సోమవారమే పోలవరం సందర్శనకు రానుండటంతో బాబు స్లోగన్ ఫాలో కావలిసి వచ్చింది కాకతాళీయంగా.

పనులు వేగంగా జరుగుతున్నా …

వాస్తవానికి మేఘా ఇంజనీరింగ్ పోలవరం పనులు మొదలు పెట్టాక శరవేగంగానే పనులు సాగుతున్నాయి. పనుల మాటెలా ఉన్నా ఇటీవల ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడంపై విపక్షాల అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తుండటం బిజెపి సర్కార్ రాజకీయ అస్త్రంగా దీన్ని మలుచుకోవడం తో జగన్ సైతం పోలవరం ప్రాజెక్ట్ పై తన సీరియస్ నెస్ ను ప్రజలకు చెప్పుకోవాలిసి రాక తప్పలేదు. ఇప్పటికే కేంద్రం దగ్గరకు మంత్రుల బృందాన్ని పంపి అక్కడ అడ్డంకులు అధిగమించే ప్రయత్నం చేస్తూనే రెండో వైపు ప్రాజెక్ట్ పనులు పదేపదే పర్యవేక్షించడం ద్వారా విమర్శకులకు అక్కడి నుంచే బదులు ఇవ్వాలని సిఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎలా ఉన్నా ప్రాజెక్ట్ నిర్మాణం, రిజర్వాయర్ అనుకున్న స్థాయిలో ఏర్పడితేనే జగన్ కోరుకున్న మైలేజ్ లభించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News