పోలవరం పీక నొక్కేస్తున్నారా?

న‌వ్విపోదురుగాక నాకేటి.. అన్నట్టుగా ఉంది వైసీపీ స‌ర్కారు ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. అత్యంత కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం విష‌యంలో నిధుల లేమిని సాకుగా చూపుతూ ఎత్తును త‌గ్గించే [more]

Update: 2020-11-27 06:30 GMT

న‌వ్విపోదురుగాక నాకేటి.. అన్నట్టుగా ఉంది వైసీపీ స‌ర్కారు ప‌రిస్థితి అంటున్నారు ప‌రిశీల‌కులు. అత్యంత కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం విష‌యంలో నిధుల లేమిని సాకుగా చూపుతూ ఎత్తును త‌గ్గించే ప్రయ‌త్నాలు చేస్తున్నారా ? అన్న సందేహాలే వ్యక్తమ‌వుతున్నాయి. ఇదే విష‌యంపై వైసీపీ, ప్రభుత్వ వ‌ర్గాల్లోనూ అంతర్గతంగా చ‌ర్చకు రావ‌డ‌మే ఈ సందేహాల‌కు మ‌రింత ఊత‌మిచ్చేలా ఉంది. బ‌హుళార్థ సాధ‌క ప్రాజెక్టుగా.. రాష్ట్రానికి జ‌ల జీవ నాడిగా భాసిల్లాల్సిన పోల‌వ‌రం ఎత్తుపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ ఎత్తు పెంపు కార‌ణంగానే విశాఖ‌కు నీరు అందించ‌డంతోపాటు.. ఇబ్బడి ముబ్బడిగా నీటి బ్యాంకును సుస్థిరం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకే గ‌త చంద్రబాబు స‌ర్కారు అటు ఒడిసా నుంచి, ఇటు తెలంగాణ నుంచి కూడా ఎత్తు పెంపుపై అభ్యంత‌రాలు వ‌చ్చినా.. ముందుకే వెళ్లింది.

జిల్లాల ఏర్పాటు కు……

ఈ క్రమంలోనే తెలంగాణ‌లోని ఏడు ముంపు గ్రామాల‌కు ఏపీలో క‌లుపుకొనేందుకు సిద్ధమ‌య్యారు. కేంద్రాన్ని కూడా ఒప్పించారు. అంత‌గా పోల‌వ‌రం ఎత్తుపై ప్రాధాన్యం ఇస్తే.. ఇప్పడు జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవ‌డంలో ఏర్పడిన గ్యాప్ కార‌ణంగా.. పోల‌వ‌రం ఎత్తును త‌గ్గించేందుకు రెడీ అయ్యార‌న్న ప్రచారం అయితే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇదిలా ఉంటే కాసేపు రాష్ట్ర ప‌రిస్థితిని కూడా అర్ధం చేసుకుందాం అనుకుందాం. అదే స‌మ‌యంలో ఇప్పటికిప్పుడు అవ‌స‌రం లేక‌పోయినా.. జిల్లాల ఏర్పాటుకు మాత్రం జ‌గ‌న్‌ స‌ర్కారు రెడీ అయింది. దీనికి దాదాపు 1300 కోట్ల రూపాయ‌లు ప్రాథ‌మికంగా అవ‌స‌ర‌మ‌వుతాయ‌ని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

టీడీపీకి క్రెడిట్ దక్కుతుందని…..

మ‌రి జిల్లాల ఏర్పాటుకు నిధులు ఉన్నాయా ? అంటే.. ఉన్నాయ‌నే అంటున్నార‌ట సీఎం. అదే పోల‌వ‌రం విష‌యానికి వ‌స్తే.. నిధులు లేవు. దీనికి కార‌ణం ఏంటి? అంటే రెండు ప్రధాన కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల స‌మ‌యానికి పోల‌వ‌రం పూర్తి చేసినా.. ఫిఫ్టీ ఫిఫ్టీ బెనిఫిటే జ‌గ‌న్ కు ద‌క్కుతుంద‌ని, టీడీపీ దీనిని స‌గం క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌. అందుకే.. దీనిని ప‌క్కన పెట్టి.. కేంద్రం నిధులు ఇస్తే. క‌ట్టేందుకు లేక‌పోతే.. లేద‌నేందుకు జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

నిధుల్లో కోత….

కేంద్రం ఇప్పటికే పోల‌వ‌రం నిధుల్లో కోత పెట్టేసింది. అస‌లు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో పోల‌వ‌రం పూర్తి చేయ‌డం అయ్యే ప‌నికాదు… పూర్తి చేసినా ఆ క్రెడిట్ వార్‌లో బీజేపీ, టీడీపీ దూరిపోతాయి. అందుకే జ‌గ‌న్ ఈ రిస్క్ చేసేందుకు ఎంత మాత్రం ఇష్టప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక‌, జిల్లాల ఏర్పాటు క‌నుక జ‌రిగిన న‌వ్యాంధ్రలో ఈ ప్రతిపాద‌న చేసిన నాయ‌కుడిగా.. ఏర్పాటు చేసిన సీఎంగా జ‌గ‌న్‌కే మొత్తం క్రెడిట్ ద‌క్కుతుంది. కేసీఆర్ తెలంగాణ‌లో జిల్లాలో విభ‌జ‌న‌తో రాష్ట్ర స్వరూపాన్ని మార్చేయ‌డంతో పాటు పాల‌న‌ను ప్రజ‌ల‌కు మ‌రింత చేరువ చేశారు.

రాజకీయ లబ్ది కోసమే….

దీనివ‌ల్ల రాజ‌కీయంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగులు అయ్యారు. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ తిరుగులేని శ‌క్తిగా మారి వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. ఇప్పుడు ఏపీలోనూ జ‌గ‌న్ జిల్లాల ఏర్పాటుపై అప‌రిమిత‌మైన ప్రేమ‌తో ఉండ‌డానికి ఇదే ప్రధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. సో.. ఈ రెండు కార‌ణాల‌తోనే జ‌గ‌న్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు. ఏదేమైనా.. పోల‌వ‌రం పీక‌నొక్కడంం స‌మంజ‌సం కాద‌నేది ప‌రిశీల‌కుల మాట‌. వైసీపీ మంత్రులు సైతం పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని డెడ్ లైన్లు పెడుతున్నా వైసీపీ వాళ్లే త‌మ సీఎంకు పోల‌వ‌రంపై అంత ఇంట్రస్ట్ లేద‌ని అంత‌ర్గతంగా చెపుతోన్న మాట‌..!

Tags:    

Similar News