వారికే పదవులు… జగన్ నిర్ణయం

రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ స‌హా వివిధ నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కానికి ప్రభుత్వం సిద్ధమైంది. వీటిని ప్రాధాన్యాల వారిగా.. మ‌హిళ‌ల‌కు 50 శాతం ప‌ద‌వులు క‌ట్టబెట్టాల‌ని పార్టీ అధినేత‌, [more]

Update: 2020-08-22 15:30 GMT

రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ స‌హా వివిధ నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కానికి ప్రభుత్వం సిద్ధమైంది. వీటిని ప్రాధాన్యాల వారిగా.. మ‌హిళ‌ల‌కు 50 శాతం ప‌ద‌వులు క‌ట్టబెట్టాల‌ని పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ నిర్ణయించుకున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఎవ‌రికి బ‌డితే వారికి ప‌ద‌వులు ఇవ్వరాద‌ని తాజాగా వైఎస్సార్ సీపీలో నిర్ణయం జ‌రిగింద‌ని అంటున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్నవారికి కూడా చాలా మందికి ఇప్పటికీ ఎలాంటి ప‌ద‌వులు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అస‌లు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్ నేత‌ల‌నే జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో అనేక కార‌ణాల‌తో ప‌క్కన పెట్టారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో చాలా మంది కొత్త నేత‌లే ఎన్నిక‌య్యారు. దీంతో చాలా మంది సీనియ‌ర్లకు, హామీలు ఇచ్చిన వారికి జ‌గ‌న్ ఏదో ఒక ప‌ద‌వితో స‌ర్దుబాటు చేయాల్సి ఉంది. ఈ లిస్టు చాంతాడంత ఉంది.

పార్టీతో అటాచ్ మెంట్…..

ఈ నేప‌థ్యంలో ప‌ద‌వుల పంప‌కానికి కొత్త టెక్నిక్ ఆలోచ‌న చేశార‌ట జ‌గ‌న్‌. దీనిని బ‌ట్టి.. ఎవ‌రికి ప‌ద‌వులు ఇవ్వాల‌న్నా కూడా అలాంటి వారికి పార్టీతో ఉన్న అనుబంధం ఏంటి ? ఎన్నాళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నారు? పార్టీలో ఎలాంటి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇస్తున్నారు. జిల్లా స్థాయిలో, మండ‌ల‌స్థాయిలో గ్రామ స్థాయిలో స‌ద‌రు నేత‌ల ప‌నితీరు ఎలా ఉంది? అనే అంశాల‌ను కూలంక‌షంగా ప‌రిశీలించాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. స‌రే! ఏదైనా మార్పు రావాల్సిందే. కానీ, ఇప్పుడు ఉన్నప‌ళాన‌.. ఒక్కసారిగా ఎందుకింత మార్పు వ‌చ్చింది ? ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా ల‌క్ష్మణ రేఖ‌లు గీసుకోవాల్సి వ‌చ్చింది.. అనే విష‌యాలు చ‌ర్చనీయాంశంగా మారాయి.

కొత్తగా వచ్చిన వారికి…..

ఇటీవ‌ల బీసీ సంక్షేమ సంఘంలో ప‌ద‌వుల కోసం నేత‌ల‌ను ఎంపిక చేసేందుకు పార్టీలో క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. ఈ క‌మిటీలు జిల్లాల వారీగా ప‌రిశీల‌న చేస్తున్నాయి. జిల్లా కేంద్రాల‌కు వెళ్లి.. అక్కడి నాయ‌కుల‌తో భేటీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనేక మంది నేత‌లు. త‌మ‌కు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండడం లేద‌ని, నిన్నగాక మొన్న వ‌చ్చిన వారు పార్టీ ప‌దవులు కొట్టుకుని పోతున్నార‌ని ఫిర్యాదులు చేశారు. సీఎం సొంత జిల్లా క‌డ‌ప‌లోనే ఇలాంటి త‌ర‌హా ప‌రిస్థితులు త‌లెత్తాయి.

నివేదిక తెప్పించుకుని…..

ఇక ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అయిన వారు…ఇత‌ర ప‌ద‌వులు పొందిన వారు సైతం పార్టీ కోసం ఎప్పటి నుంచో క‌ష్టప‌డిన కార్యక‌ర్తల‌ను నిర్దాక్షిణ్యంగా అణిచి వేశారన్న కంప్లైంట్లు ఉన్నాయి. దీంతో ఈ విష‌యాల‌పై మంత్రి ఆదిమూల‌పు సురేష్ సీఎం జ‌గ‌న్‌కు నివేదిక అందించారు. ఈ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలించిన జ‌గ‌న్ పార్టీ కోసం ప‌నిచేసిన వారిని గౌర‌వించాల్సిందేన‌ని చెప్పార‌ట‌. మొత్తంగా త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని పాత‌నేత‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News