త్రీ మంత్స్ లోనే తేలిపోతుందా?

ఎనిమిది నెలల తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు జగన్ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి జగన్ [more]

Update: 2019-12-21 13:30 GMT

ఎనిమిది నెలల తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు జగన్ ప్రభుత్వానికి సవాలుగా మారనున్నాయి. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాలపైనే దృష్టి పెట్టారు. అభివృద్ధి పనులను పట్టించుకోలేదన్నది మాత్రం వాస్తవం. ఫలితంగా ఏపీలోని అనేక నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదు. రహదారులు, పక్కా ఇళ్ల నిర్మాణం వంటి వాటిని ఇంకా జగన్ ప్రభుత్వం ప్రారంభించలేదు.

ఎమ్మెల్యేల పనితీరుపై…..

దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేల వారీగా నివేదికలను తెప్పించుకోవాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాలు కూడా ముగియడంతో ఎమ్మెల్యేలంతా ఇక నియోజకవర్గాలకే పరిమిత మవ్వాలని వైసీపీ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఈ మూడు నెలల పాటు నియోజకవర్గాలను వదలకూడదన్న ఆదేశాలు ఇప్పటికే ఎమ్మెల్యేలకు వెళ్లాయి. ఏ జిల్లాలో పార్టీ వీక్ గా ఉంది? ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఫెర్మఫార్మన్స్ ఎలా ఉందన్న దానిపై వైసీపీ నిఘా నివేదికలు తెప్పించుకుంటోంది.

అభివృద్ధి కార్యక్రమాలను….

అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయకపోయినా సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుండటం, జనవరి నెలలో అమ్మవొడి కార్యక్రమం వంటి పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు వంటి వాటితోనే ఈ ఎన్నికలను వైసీపీ గెట్టెక్కాలనుకుంటోంది. అందుకు ఎమ్మెల్యేలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. జనవరి నెలలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కాననున్నట్లు తెలుస్తోంది.

జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో….

ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఆరు నెలల నుంచి ఎమ్మెల్యేలతో జగన్ సమావేశం కుదరడం లేదు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోకుంటే పరువు పోవడమే కాకుండా ప్రతిపక్షం గొంతు మరింత పెద్దదవుతుందన్న అనుమానం వైసీపీ అధిష్టానంలో ఉంది. గ్రామాల్లో ఉన్న క్యాడర్ లో కూడా నైరాశ్యం అలుముకుందని చెబుతున్నారు. తమ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరిపోతాయని భావించిన క్యాడర్ కు ఇప్పటి వరకూ ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు. దీంతో ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయితేనే తప్ప క్యాడర్ లో జోష్ పెరగదంటున్నారు. జగన్ శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే తానే ఒంటిచేత్తో స్థానిక సంస్థల ఎన్నికలను గెలిపించుకోవాలని భావిస్తే అది మొదటికే మోసం వస్తుందని సీనియర్ నేతలు సయితం భయపడుతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యపై నిఘా నివేదికలు అందిన తర్వాతనే జగన్ అందుకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు.

Tags:    

Similar News