ముహూర్తం పెట్టేశారట

అధికారమంతా ఒకే చోట ఇపుడు చేరిపోయింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, పెరగబోతున్న ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, వందల కొద్దీ నామినేటెడ్ పదవులు, వైసీపీలో [more]

Update: 2019-08-05 02:30 GMT

అధికారమంతా ఒకే చోట ఇపుడు చేరిపోయింది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, పెరగబోతున్న ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, వందల కొద్దీ నామినేటెడ్ పదవులు, వైసీపీలో ఓ విధంగా పదవుల జాతర కనిపిస్తోంది. వై.ఎస్.జగన్ వెంట ఉంటే ఏం లాభమనుకుని మధ్యలోనే జారుకున్న వారు దురదృష్టవంతులు. వై.ఎస్.జగన్ తో కొంతకాలం నడిచి టీడీపీలోకి వెళ్ళిపోయిన వారిది మరో రకం బ్యాడ్ లక్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వై.ఎస్.జగన్ తోనే ఉంటూ, జగన్ మాటే వింటూ పదేళ్ళ పాటు పోరాడిన వారే ఇపుడు అసలైన అదృష్టవంతులు. ఏపీలో వైసీపీకే పదవులు అన్నీ. పంచుకోవడానికి మరో ప్రతిపక్షం కూడా లేదు. కనీసం పోటీ పడడానికి వారికి ఆ సంఖ్యాబలం కూడా లేదు. పెద్దల సభ అయినా మరేదైనా కూడా వైసీపీకే చాన్స్. దాంతో వై.ఎస్.జగన్ వరాలు ఇచ్చే దేవుడిలా ఇపుడు వైసీపీ నేతలకు కనిపిస్తున్నారు. మమ్ము కరుణించు స్వామీ అంటూ పార్టీ నేతలు అధినేత కళ్ళ ముందే తిరుగుతున్నారు.

ఎమ్మెల్సీలతో మొదలు…

ఏపీలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. దాంతోనే వైసీపీలో కొత్త సందడి కూడా వచ్చింది. మూడు ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ ఎక్కువగానే ఉన్నా వై.ఎస్.జగన్ ఎవరిని ఎంపిక చేస్తే వారే పెద్ద మనుషులు అవుతారన్నది వాస్తవం. ఇది ఇంతటితో కాదు, మరో పదకొండు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ గా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా షెడ్యూల్ త్వరలోనే విడుదల అవుతుంది. వాటిలో గవర్నర్ నామినేట్ చేసేవి అయిదు ఉంటే, మరో ఆరు లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుచుకునేవి. దాంతో అవి కూడా వైసీపీకే దక్కుతాయన్నది వాస్తవం. ఇవి కాకుండా 2020 నాటిని రాజ్యసభ ఖాళీలు కూడా ఏర్పడుతున్నాయి. ఏపీలో సుబ్బరామిరెడ్డితో పాటు మరోకరు పదవీ విరమణ చేస్తారట. దాంతో ఆ ఎంపీ సీట్లు కూడా వైసీపీకే దక్కుతాయి.

నామినేటెడ్ పోస్టులు…..

ఏపీలో కుప్పలు తెప్పలుగా నామినేటెడ్ పదవులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ కార్పొరేషన్లు ఉన్నాయి. ఆలాగే వివిధ సామాజిక వర్గాలకు కూడా కార్పొరేషన్లు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ల పదవులు అయితే వందల్లోనే ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు వై.ఎస్.జగన్ ముహూర్తం నిర్ణయించారట. ఆగస్ట్ నెల మంచి రోజులు కావడంటో ఒకటొకటిగా అన్ని పదవులూ కూడా వై.ఎస్.జగన్ వరసగా భర్తీ చేస్తారట. అంటే వైసీపీ కోసం ఏళ్ళ తరబడి పనిచేసిన వారికి సరైన న్యాయం జరుగుతుందన్నమాట. మరి చూడాలి ఈ పదవుల జాతర పార్టీలో ఎలాంటి కొత్త ఉత్సాహాన్ని తెస్తుందో.

Tags:    

Similar News