పవన్ నీ ఐదుగురు పిల్లలు ఎక్కడ?

వెంకయ్యనాయుడు మనవళ్లు ఏ స్కూళ్లలో చదువుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్న విధానంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో [more]

Update: 2019-11-11 06:55 GMT

వెంకయ్యనాయుడు మనవళ్లు ఏ స్కూళ్లలో చదువుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెడుతున్న విధానంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఘాటుగా స్పందించారు. ప్రతి పేదవాడూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలకు ఐదుగురు పిల్లలని, వారు ఏ స్కూళ్లలో చదువుతున్నారని నిలదీశారు. వీరి పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదువుకోవాలని, పేద పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం మాత్రం వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. అబ్దుల్ కలాం విద్యా అవార్డుల కార్యక్రమంలో జగన్ మాట్లాడారు.

ప్రపంచంతో పోటీ పడాలంటే…

ప్రపంచంతో పోటీ పడుతున్నప్పుడు ఇంగ్లీష్ మీడియం అవసరమన్నారు. తన ఆరాటాన్ని విపక్షాలు అర్థం చేసుకోవడం లేదన్నారు. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు అని కొందరు మాట్లాడారన్నారు. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం నేరమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు చదివింది…మనవడు చదవబోతోంది ఏ మీడియం అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ ను పూర్తిగా అమలు చేసి అందరూ పేదలకు పూర్తి స్థాయి విద్యను అందిస్తామని చెప్పారు. మార్చిలో వైఎస్సార్ పెళ్లికానుకను తేబోతున్నామన్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన దానికన్నా రెట్టింపు ఇస్తామన్నారు. పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తానని, తనకు కొంచెం టైమ్ ఇవ్వాలని జగన్ కోరారు.

Tags:    

Similar News