వైఎస్ కోటరీతోనే జగన్ బిగ్ ఫైట్ ?

జగన్ తండ్రి వైఎస్సార్ ఎవరిని మచ్చిక చేసి తన పక్కన ఉంచుకున్నారో, ఎవరి కోసం ఒకానొక దశలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సైతం ఎదిరించారో అటువంటి వైఎస్సార్ కోటరీ [more]

Update: 2020-07-02 12:30 GMT

జగన్ తండ్రి వైఎస్సార్ ఎవరిని మచ్చిక చేసి తన పక్కన ఉంచుకున్నారో, ఎవరి కోసం ఒకానొక దశలో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని సైతం ఎదిరించారో అటువంటి వైఎస్సార్ కోటరీ ఇపుడు జగన్ కి ఎదురు నిలిచి ఉందనిపిస్తోంది. లేకపోతే వైఎస్సార్ కొడుకుగా జగన్ అంటే తనకు ఇష్టమని చెబుతూనే ఆయన సీఎంగా ఇష్టం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎలా కుండబద్దలు కొడతారు. ఆ మాటకు వస్తే ఉండవల్లి ఎపుడూ జగన్ ని పెద్దగా మెచ్చుకున్న దాఖలాలు లేవు, జగన్ కి అనుకూల వేవ్ ఉన్నా చివరి నిముషంలో చంద్రబాబు ఎన్ని ఎత్తులు అయినా వేసి గెలుస్తారు అంటూ 2019 ఎన్నికల ముందు జోస్యం చెప్పిన పెద్ద మనిషి ఉండవల్లి అని వైసీపీ నేతలు మండిపడతారు. ఇక వైఎస్సార్ ఆత్మగా పేరుగడించిన కేవీపీ రామచంద్రరావు సైతం జగన్ కి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారా అన్న చర్చ కూడా వైసీపీలో ఇపుడు సాగుతోందిట.

వియ్యంకుడే అలా …

నర్సాపురం ఎంపీ రఘురామక్రిష్ణంరాజు ఎవరో కాదు, కేవీపీ రామంచంద్రరావు సొంత వియ్యంకుడు. మరి ఆయనకు జగన్ టికెట్ ఇచ్చి గెలిపిస్తే బొచ్చు నాయకత్వం అంటూ హాట్ కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి. పైగా పార్టీ నెగ్గి ఏడాది కాకుండానే అగ్గిరాజేయడాన్ని ఏమనుకోవాలి. ఎవరి మేలు కోసం ఇదంతా చేస్తున్నట్లుగా భావించాలి. ఇక బీజేపీతో జగన్ మంచి సంబంధాలే నెరుపుతున్నారు. ఒకవేళ రాజు గారికి ఏవైనా ఇబ్బందులు వ్యాపారాల్లో ఉంటే జగన్ తో చెప్పించుకుని అయినా పరిష్కరిరించుకోవచ్చు. కానీ అలా చేయకుండా ఏకంగా బీజేపీలోకి వెళ్లాలని ఆయన ఉబలాటపడడం ఏంటన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. ఇలా వియ్యంకుడు చెలరేగిపోతున్నా కేవీపీ పట్టనట్లుగా ఉంటున్నారంటే ఆయన జగన్ మేలు కోరేవారా అని వైసీపీ నేతలే ప్రశ్నిస్తున్నారుట.

వాళ్లంతా అలా :

ఇక విశాఖకు చెందిన మాజీ ఎంపీ సబ్బం హరి కూడా కేవీపీ మనిషే. కేవీపీ మాట మీదనే వైఎస్సార్ చివరి నిముషంలో 2009 ఎన్నికల్లో ఆయన‌కు అనకాపల్లి టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచి పార్లమెంట్ లో అడుగుపెట్టారు కూడా. ఇక అనంతరం జగన్ పక్కకు వచ్చిన హరి ఆ తరువాత అక్కడ ఉంటూనే 2014 ఎన్నికల్లో జగన్ గెలవడు అని అపశకునాలు పలికి సస్పెండ్ అయ్యారు. ఇపుడు హరి తెల్లారితే జగన్ని విమర్శిస్తారు. మరి కేవీపీ ఆయనకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అంటారు.

ధర్మాన వంటి వారు కూడా…..

అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ వంటి వారు కూడా కేవీపీకి సన్నిహితులే. అలాగే ఈ మధ్యన ఓ పెద్దాయన మాజీ మంత్రి జగన్ కి వ్యతిరేకంగా గళం విప్పారు. ఆయన సైతం కేవీపీకి దగ్గరివారే అంటారు. ఇలా వీరంతా రెచ్చిపోవడం, అదీ ఒకే సమయంలో అంటే దీని వెనక ఎవరు ఉన్నారు, కేవీపీని కూడా తన మాస్టర్ మైండ్ తో చంద్రబాబు తిప్పుకుని జగన్ మీద మామనే ప్రయోగిస్తున్నారా అన్న డౌట్లు వైసీపీ పెద్దల్లో వస్తున్నాయట.

Tags:    

Similar News