జగన్ వైపు టర్న్ అవుతారా? అందుకే ఆ ప్రయత్నమా?

జగన్ ఆలోచనలు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో వెళుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించడంతో పాటు రానున్న కాలంలో అన్ని గ్రామాలను తమవైపునకు తిప్పుకోవాలన్నది జగన్ [more]

Update: 2020-06-01 02:00 GMT

జగన్ ఆలోచనలు పూర్తిగా ఆత్మవిశ్వాసంతో వెళుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించడంతో పాటు రానున్న కాలంలో అన్ని గ్రామాలను తమవైపునకు తిప్పుకోవాలన్నది జగన్ వ్యూహంగా ఉంది. నిజానికి గ్రామాలు ఎప్పుడూ రెండు వర్గాలుగా విడిపోయి ఉంటాయి. అక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పని ఉండదు. ఎప్పుడూ గ్రామస్థాయిలో పార్టీలుగా విడిపోయి ఉంటాయి. ఇది కాదనలేని వాస్తవం.

ఏపీలో మాత్రం…..

మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కులాలు, మతాలు అన్ని హంగులు ఎన్నికల సమయంలో కనపడతాయి. ఇక ఏపీలో గ్రామాల సంగతి చెప్పనక్కర లేదు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా గ్రామాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థిితి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రాలో ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తాయి. అయితే జగన్ గ్రామాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.

కేజ్రీవాల్ తరహాలో….

కేజ్రీవాల్ తరహాలో హెల్త్ క్లినిక్ లను గ్రామస్థాయిలో ఏర్పాటు చేయనున్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ ప్రాంతంలోని అనేక వార్డుల్లో మొహల్లా క్లినిక్ లను ఏర్పాటు చేశారు. ఈ ఎఫెక్ట్ మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనపడింది. ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చుచేయకపోవడం, వైద్యం , విద్య అందుబాటులోకి రావడంతో కేజ్రీవాల్ కు మరోసారి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు. ఇప్పుడు జగన్ అదే వ్యూహంతో వెళుతున్నారు. ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు.

గ్రామాల్లో అన్ని రకాలుగా….

హెల్త్ క్లినిక్ లలో ఒక నర్సుతో పాటు 54 రకాల మందులు ఉంచుతారు. వీటిని ఉచితంగా ప్రజలకు అందిస్తారు. అలాగే అనారోగ్య తీవ్రతను బట్టి వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులకు తరలిస్తారు. వీరికి ఆరోగ్య శ్రీని కూడా వర్తింపచేస్తారు. అలాగే గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ఏర్పాటు చేస్తారు. అంతే కాదు గ్రామాల్లో జనతా బజార్లను ఏర్పాటు చేసి అన్ని రకాల విక్రయాలను అక్కడి నుంచే జరపనున్నారు. గ్రామాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. అదే జరిగితే మళ్లీ తన విజయానికి గ్రామాలు అండగా నిలుస్తాయని జగన్ ఆశిస్తున్నారు. మరి జగన్ ఐడియా ఏమేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News