జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే…?

జగన్ తలచుకుంటే ఏదైనా జరగాల్సిందే. ఆయనది అంత పట్టుదల. అదిపుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందా అన్న డౌట్లు వస్తున్నాయి. జగన్ కి శాసనమండలి అంటే ఇపుడు బద్ద [more]

Update: 2020-03-04 14:30 GMT

జగన్ తలచుకుంటే ఏదైనా జరగాల్సిందే. ఆయనది అంత పట్టుదల. అదిపుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందా అన్న డౌట్లు వస్తున్నాయి. జగన్ కి శాసనమండలి అంటే ఇపుడు బద్ద శత్రువు అయిపోయింది. దానికి ఉసురు తీయాలనుకుని అసెంబ్లీలో బిల్లు పెట్టి మరీ రద్దు తీర్మానం ఆమోదించి కేంద్రానికి జగన్ పంపారు. అయితే అక్కడ బిల్లు పెండింగులో ఉంది. ఈ లోగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం తోసుకువచ్చింది. దాంతో జగన్ కళ్ళ ముందు మరోమారు మండలి కనిపిస్తోందిట.

వద్దు అంటున్నారే….

బడ్జెట్ సమావేశాలు జరిగే ప్రతీసారి గవర్నర్ స్పీచ్ ఉంటుంది. ఉభయ సభల‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతారు. అయితే ఈసారి కౌన్సిల్ ని పిలవకుండానే కేవలం అసెంబ్లీని మాత్రమే సమావేశపరచి గవర్నర్ తో స్పీచ్ ఇప్పించాలని ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఆలోచిస్తున్నారుట. మండలిని రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించాం కాబట్టి తమ వరకూ అది లేనట్లేనని జగన్ గట్టిగా భావిస్తున్నారుట.

కుదిరేనా….

నిజానికి మండలి రద్దు అన్నది ఇప్పటిదాకా ప్రక్రియ మాత్రమే ప్రారంభమైంది. మండలి రద్దు అన్నది ఆచరణలోకి రావాలంటే పార్లమెంట్ ఉభయ సభలూ ఆమోదించాలి. అప్పటివరకూ శాసనమండలి మనుగడలో ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అయితే జగన్ మాత్రం మండలి రద్దు అయిపోయిందని దాని వూసే తలవడంలేదుట. ఇది కొత్త రాజ్యాంగ సంక్షోభానికి తెరతీస్తుందా అన్న చర్చ కూడా నడుస్తోంది.అయితే కేంద్రం వద్ద మండలి రద్దు బిల్లు పెండింగులో ఉందని సాకేతిక కారణం చూపించి కౌన్సిల్ ని ఈసారి పిలవకపోవచ్చునని మరికొందరు నిపుణులు అంటున్నారు.

కోర్టు దాకా…..

అయితే కౌన్సిల్ ని పిలవకుండా అసెంబ్లీని మాత్రమే జగన్ సమావేశపరచితే మాత్రం తాము కోర్టుకు వెళ్ళడానికి సిధ్ధమని టీడీపీ నేతలు అంటున్నారు. ఇది పక్కా రాజ్యాంగ సంక్షోభానికి తెర తీసే అంశమని కూడా వాదిస్తున్నరు. ఇక మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు వంటివి గవర్నర్ ప్రసంగంలో వస్తే తాము అడ్డుకుని తీరుతామని కూడా సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు వంటి వారు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి జగన్ కి మండలి తలనొప్పి ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News