జగన్ ప్రపోజల్.. వెయిట్ చేయమన్న కేంద్రం

కేంద్రం బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల అమలు ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పింది. మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి [more]

Update: 2020-02-23 11:00 GMT

కేంద్రం బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల అమలు ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పింది. మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఏపీ ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. వీటిని 25 కు పెంచాలని జగన్ భావించారు. తన పాదయాత్రలోనూ పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా చేస్తానని చెప్పారు. అదే విషయాన్ని మ్యానిఫేస్టోలోనూ పెట్టారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై…..

నిజానికి మ్యానిఫేస్టోలో పెట్టిన అంశాలతో పాటు, పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా జగన్ అమలు చేసుకుంటూ వెళుతున్నారు. అందులో కొత్త జిల్లాల ఏర్పాటు ముఖమైనది కూడా. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దీనిని వెంటనే కార్యరూపంలోకి తేవాలని జగన్ భావించారు. అనకాపల్లి, అరకు, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, నర్సారావుపేట, బాపట్ల, తిరుపతిర, రాజంపేట, నంద్యాల, హిందూపురం లను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపారు.

కేంద్రం కొర్రీ…..

అయితే జగన్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం కొర్రీలు వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలసిన జగన్ జిల్లాల పెంపు ప్రతిపాదనను కూడా వివరించారు. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ కోరారు. జిల్లాల ఏర్పాటుతో పరిపాలన వికేంద్రీకరణతో పాటు ఆ యా ప్రాంతాల అభివృద్ధి వేగిరంగా జరుగుతుందని జగన్ భావన. దీంతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పార్టీ పట్టు పెంచుకునే వీలుంది.

జనగణన తర్వాతే…..

కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం జిల్లాల పెంపు ఇప్పట్లో లేదని తేల్చి చెప్పినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా జనగణన జరగనున్న సమయంలో జిల్లాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దేశ వ్యాప్తంగా జనగణన మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో సరిహద్దుల మార్పులతో సిబ్బందికి జనగణన సాధ్యం కాదని, ఏడాది పాటు కొత్త జిల్లాల ప్రతిపాదనను తీసుకు రావద్దని కేంద్రం చెప్పేసింది. దీంతో మారో ఏడాది పాటు ఏపీలో కొత్త జిల్లాలు లేనట్లేనని చెప్పాలి. జనగణన పూర్తయిన తర్వాతనే కొత్త జిల్లాల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశముంది.

Tags:    

Similar News